అక్టోబ‌రు 31 నుండి న‌వంబ‌రు 2వ తేదీ వ‌ర‌కు హైద‌రాబాద్‌ శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

0 9,256

తిరుపతి ముచ్చట్లు:

 

హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 31 నుండి న‌వంబ‌రు 2వ తేదీ వరకు ప‌విత్రోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ఏకాంతంగా జ‌రుగ‌నున్నాయి.అక్టోబరు 30వ తేదీ ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఆచార్య రుత్విక్‌వ‌ర‌ణం, సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వ‌ర‌కు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.యాత్రికులు, సిబ్బంది వల్ల తెలియక జరిగిన దోషాలవల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.పవిత్రోత్సవాల్లో భాగంగా అక్టోబరు 31వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటలకు పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. నవంబరు 1వ తేదీ మధ్యాహ్నం 12.00 నుండి 1.00 గంట వరకు పవిత్ర సమర్పణ చేస్తారు. నవంబరు 2వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 9 గంటల వరకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

 

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Sacred Celebrations of Sri Venkateswaraswamy in Hyderabad from October 31st to November 2nd

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page