మేమే దాడి చేయాలనుకుంటే సజ్జల సంచలన వ్యాఖ్యలు

0 8,766

అమరావతిముచ్చట్లు:

- Advertisement -

టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ తప్పుబట్టారు. ‘‘మేమే దాడి చేయాలనుకుంటే అది వేరే రకంగా ఉంటుంది. పదిమంది పిల్లల్ని పంపిస్తామా’’ అని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బోస డికే అంటే బాగున్నారా అని అర్థం అంటున్నారని, ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షాను  అదేవిధంగా పలకరిస్తారా? అని ప్రశ్నించారు. పట్టాభి మాట్లాడిన మాటపై ముఖ్యంగా మహిళల్లో చర్చ జరగాలన్నారు. ఇటువంటి పదం రాజకీయ పదకోశంలో ఉండకూడదని సూచించారు. అది తప్పు అని చంద్రబాబు అనుకోవటం లేదని సజ్జల విమర్శించారు.
పార్టీ కార్యాలయంలోనే మాట్లాడారు కాబట్టే అక్కడికే తమ అభిమానులు వెళ్లారని సజ్జల తెలిపారు. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఇంతకంటే ఎక్కువే మాట్లాడారని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పార్టీలకు స్థానం ఉండకూడదన్నారు. టిడీపీ  పార్టీని రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కలుస్తామని ప్రకటించారు. ఆయన క్షమాపణ కోరే వరకూ విమోచన ఉండదని చెప్పారు. టీడీపీలో వివేకం ఉన్న వాళ్లు ఉంటే చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Sajjala sensational comments if we want to attack ourselves

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page