తాహశీల్దార్ గుండెపోటుతో మృతి.

0 7,604

కాకినాడ   ముచ్చట్లు:

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. తొండంగి మండల ఇంచార్జి తహశీల్ధార్  కనకరాజు (50)  తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నతాధికారులతో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. పరిస్థితి గమనించిన కార్యాలయ సిబ్బంది తుని ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించినప్పటికీ పరిస్థితి చేజారి పోవడంతో తాసిల్దార్ కనకరాజు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. శుక్రవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఎం. హరి కిరణ్ తో వీసిలో పాల్గొన్న ఎమ్మార్వో రాజు వీసీలో ఉండగానే ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కూప్పకూలిపోవడంతో సాటి సహోద్యోగులు అందరూ అవాక్కయ్యారు. ఇన్చార్జ్ తాసిల్దార్ రాజు గుండెపోటు సంభవించడం వల్లే మృతి చెందడం జరిగిందని తుని ఏరియా ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ధృవీకరించారు. సమాచారం తెలుసుకున్న జిల్లా రెవిన్యూ అధికారులు హుటాహుటిన తొండంగి గ్రామానికి చేరుకొని చోటు చేసుకున్న సంఘటన పై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Tahsildar died of a heart attack

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page