వెంటిలేటర్ పై వున్న టీడీపీ.

0 7,576

విశాఖపట్నం ముచ్చట్లు:

ఏపీలో టీడీపీ వెంటిలేటర్పై ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. టిడిపి తీరుకు నిరసనగా వైసీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిదిలో కేకే రాజు ఆద్వర్యంలో చేపట్టిన దీక్షలో పాల్గోన్న వైసీపీ ఎంసి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. గతంలో టీడీపీ పాలన ఎలా ఉండేదో ప్రజలకు తెలుసని అన్నారు. 2019 నుంచి ప్రతి ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైందని అన్నారు.  సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నారని అన్నారు. లోకేష్ ట్విట్టర్లో అసభ్య పదజాలాన్ని వాడుతున్నారని మండిపడ్డారు. ప్రతి పక్షం ప్రజా సమస్యలపై పోరాడాలి కానీ అసభ్యంగా దూషించడం సరికాదని ఎంపీ విజయసాయిరెడ్డి హితవు పలికారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:TDP on the ventilator

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page