ప్రారంభోత్సవానికి సిద్ధంగా  సంక్షేమ వసతి గృహాలు.

0 7,562

వేములవాడ   ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలను ప్రారంభించడానికి సిద్ధం కాగా చందుర్తి, రుద్రంగి మండలంలో సంక్షేమ వసతి గృహాలను ప్రారంభానికి సిద్ధం చేశారు. కరోనా నేపథ్యంలో గత 19 మాసాలుగా హాస్టళ్లు మూతపడగా కరోన తగ్గిన నేపథ్యంలో ఇటీవలఅన్ని పాఠశాలలు ప్రారంభం కాగా హాస్టళ్ల ప్రారంభానికి కాస్త బ్రేక్ పడింది. అన్ని వసతి గృహాలు ప్రారంభించాలని కోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం  మోడల్. గురుకుల. సంక్షేమ వసతి గృహాలను ప్రారంభించడానికి అనుమతించింది.  దీంతో చందుర్తి సంక్షేమ వసతి గృహా అధికారి రవీంద్ర స్వామి  చందుర్తి లో అద్దె భవనంలో కొనసాగుతున్న వసతి గృహంలో మంచినీటి సౌకర్యం. శానిటేషన్.  డోర్ల మరమ్మతులు  చేపట్టారు. అలాగే రుద్రంగి ప్రభుత్వ పక్కా భవనం లో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు మాపో ప్రారంభించడానికి హాస్టళ్ల ను సిద్ధంగా ఉంచినట్లు  వార్డెన్ రవీంద్ర స్వామి తెలిపారు,

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Welfare shelters ready for inauguration

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page