వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజాదరణ లభిస్తోందన్న అక్కసుతోనే చంద్రబాబు నీచరాజకీయలు…

0 8,928

– తిరుపతి ఎమ్మెల్యేభూమన ధ్వజం

– వైఎస్సార్ సీపీ శ్రేణుల వినూత్న నిరసన….
– చంద్రబాబు దిష్టి బొమ్మకు అంతిమ సంస్కారాలు…

- Advertisement -

తిరుపతి ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజాదరణ లభిస్తోందన్న అక్కసుతోనే ప్రతిపక్ష నేత చంద్రబాబు చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ధ్వజమెత్తారు. జనాగ్రహ దీక్షలో భాగంగా…తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట శుక్రవారం ఉదయం వైఎస్సార్ సీపీ శ్రేణులు వినూత్న నిరసన నిర్వహించారు. చంద్రబాబు దిష్టి బొమ్మను పాడి పై పెట్టి, డప్పు వాయిద్యాల మధ్య అంతిమ యాత్ర నిర్వహించారు. లోకేష్ వేషధారణలో ఉన్న కార్యకర్తతో దిష్టి బొమ్మకు నిప్పు అంటించి, అంతిమ సంస్కారాలు చేపట్టారు. కార్యకర్తలు బై బై బాబు అంటూ అరిచారు. ఈ జనాగ్రహ దీక్షల్లో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షనేత చంద్రబాబు విధానాలను ఎండగట్టారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల వల్ల లబ్ది పొందుతున్న పేద ప్రజలంతా కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే మళ్లీ ఓట్లు వేసి, మరోసారి అధికారంలోకి తీసుకొస్తారన్న అక్కసు, భయంతో చంద్రబాబు విచక్షణ కూడా కోల్పోయారని దుయ్యబట్టారు. ఈ కారణంచేతే ఇష్టమొచ్చినట్టుగా ముఖ్యమంత్రి మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలను చేపట్టారని భూమన విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన అధికార ప్రతినిధి పట్టాభి అత్యంత నీచంగా, సభ్య సమాజం తల దించుకునే విధంగా మాట్లాడారని ఆక్షేపించారు.టీడీపీ దిగజారుడు రాజకీయాలకు వ్యతిరేకంగా జగన్ మోహన్ రెడ్డి అభిమానులు లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తున్నారని వివరించారు.

ముఖ్యమంత్రిగురించి ప్రతిపక్షం ఇష్టారీతిగా ప్రవర్తిస్తోందని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నంలో జనాగ్రహ దీక్షలు జరుగుతున్నాయన్నారు.మత్తు పదార్థాలను ఉక్కు పాదాలతో అణగదొక్కలని ముఖ్యమంత్రి చెబుతుంటే… తెలుగుదేశం నాయకులు వక్రభాష్యం చెబుతున్నారని దుయ్యబట్టారు. ఏ ఒక్కరు కూడా మద్యానికి బానిసలు కాకూడదని, గంజాయి వంటి మత్తుకు బానిసలు కాకూడదని ఐదు నెలల కిందటే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తిరుపతి నగర పాలక సంస్థ కౌన్సిల్ లో కూడా తీర్మానించిన విషయాన్ని భూమన గుర్తు చేశారు. అంతే కాకుండా ఈ మత్తు పదార్థాల రవాణాకు వ్యతిరేకంగా, మత్తు కు యువకులు బానిసలు కాకూడదని వైఎస్సార్ సీపీ వివిధ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ ఒక్క రాష్ట్రంలో ఏ పార్టీకి రాని విధంగా వైఎస్సార్ సీపీ కి ప్రజలు అత్యధిక ఓట్లు సీట్లు ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరాల కాలంలో 1.21 లక్షల కోట్ల రూపాయలను నేరుగా ప్రజల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.

 

 

ప్రజల గుండెల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోతారని, అలాంటి నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి నీచంగా మాట్లాడటాన్ని, మాట్లాడించడాన్ని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారన్నారు. అందుకే ఈరోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద చంద్రబాబు చేస్తున్నటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా రోడ్ల మీదికి తరలి వచ్చారన్నారు. ఇలా ప్రజలు రోడ్ల మీదకు వచ్ఛే పరిస్థితి చంద్రబాబు కల్పించారని, రాష్ట్రం లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు చంద్రబాబే కారణమన్నారు. చంద్రబాబుపై ప్రజలకు విశ్వాసం లేదన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో పూర్తిగా మురిగిపోయిన సరుకుగా చంద్రబాబు మారిపోయారని భూమన పేర్కొన్నారు. ప్రజలంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డినే నమ్ముతున్నారని భూమన అన్నారు. భవిష్యత్తులో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రతిపక్షంలో చంద్రబాబు లాంటి అసమర్థ నాయకుడు కొనసాగాలని, చంద్రబాబు లాంటి అసమర్థ నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రి గా కొనసాగుతారని అన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, వైఎస్సార్ సీపీ శాసన సభ్యురాలు రోజాని పనిగట్టుకుని, ఓ సంవత్సరం పాటు శాసనసభ కు రానివ్వకుండా కుట్రచేసారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి కూడా చంద్రబాబు తన మనుషులతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడించారని భూమన విమర్శించారు. భూమన కరుణాకర రెడ్డి చేపట్టిన దీక్షకు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని, సంఘీభావం ప్రకటించారు. తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, పాల్గొన్నారు. వై ఎస్ ఆర్ టీ యూ సీ సంఘీభా వం తిరుపతి శాసనసబ్యులు భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్నా జనాగ్రహ దీ క్ష కు వై ఎస్ ఆర్ టీ యూ సీ రాష్ట్ర నాయకులు ఎన్. రాజా రెడ్డి, షేక్ మహ్మద్ రపీ, సాంఘి భావం తెలిపారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:YS Jagan Mohan Reddy is gaining popularity.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page