ప్రభుత్వ చౌక ధరల దుకాణాల డీలర్లు ఖాళీ గోనెసంచులను  ఎంఎల్ఎస్ పాయింట్స్ కి అందజేయాలి నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

0 9,672

నంద్యాల ముచ్చట్లు:

 

ప్రభుత్వ చౌక ధరల దుకాణాల డీలర్లు ఖాళీ గోనెసంచులను  ఎంఎల్ఎస్ పాయింట్స్ కి అందజేయాలి అని నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ డీలర్లను ఆదేశించారు.శనివారం నంద్యాల సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ నంద్యాల రెవెన్యూ డివిజన్ లోని ప్రభుత్వ చౌక ధరల దుకాణాల డీలర్లు ఖాళీగోనెసంచులను  ఎంఎల్ఎస్ పాయింట్స్ కి అందజేయాలి అని   డీలర్లకు  ఆదేశించామన్నారు.రేషన్ షాప్ ల  డీలర్ లు బియ్యం పంపిణీ చేసిన అనంతరం ఖాళీ సంచులను ఎం ఎల్ ఎస్ పాయింట్స్ కు అందజేయాలన్నారు.దాదాపుగా ఆరు మాసాల నుంచి ఖాళీ బియ్యం సంచులు ఎంఎల్ఎస్ పాయింట్ కు అందజేయాలని రేషన్ షాప్ డీలర్లకు చెబుతున్నా వారు పట్టించుకోవడం లేదన్నారు.ధాన్యం కొనుగోలు చేసేందుకు సంచులు అవసరం ఉన్నందున రేషన్ పంపిణీ పూర్తయిన వెంటనే తిరిగి ఖాళీ సంచులు ఇవ్వాలన్నారు.డీలర్ లు ఖాళీ సంచులు తిరిగి ఇవ్వకపోతే వారికి నోటీసులు జారీ చేసి డీలర్ షిప్ క్యాన్సల్ చేయడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించిన సివిల్ సప్లై  డిప్యూటీ తహసీల్దార్లు  పర్యవేక్షణ చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Dealers of government discount stores are required to deliver empty gonads to MLS points Nandyala Sub Collector Chahat Bajpayee

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page