నేడు గూడూరులో ఇందిరా ఆర్థోపెడిక్ హాస్పిటల్ నూతన ప్రారంభం

0 7,773

-ముఖ్యఅతిథిగా పాల్గొననున్న గూడూరు ఎమ్మెల్యే

నెల్లూరు  ముచ్చట్లు:

- Advertisement -

నెల్లూరు జిల్లా, గూడూరు పట్టణంలో మొట్ట మొదటి సారిగా అనుభవజ్ఞులైన ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్.వై సందేష్ రెడ్డి ఇందిర ఆర్థోపెడిక్ హాస్పిటల్ ను అక్టోబర్ 24 వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం చేయనున్నారు. హాస్పిటల్  ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు పాల్గున్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభం చేస్తున్నట్లు డాక్టర్.వై సందేష్ రెడ్డి తండ్రి ,కోట మండలం కొక్కుపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రజానేత ,మాజీ  ప్రాదేశిక సభ్యులు యర్రటపల్లి మధు సూదన్ రెడ్డి శనివారం వెల్లడించారు.
ఈ సందర్భంగా మధు సూధన్ రెడ్డి మాట్లాడుతూ  ఇందిర ఆర్థోపెడిక్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి అందరికి ఆహ్వానం పలుకుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రారంభోత్సవ కార్యక్రమానికి కి వచ్చే వారు కోవిడ్ నిబంధనలు పాటించి, తన కుమారుడు డాక్టర్.వై సందేష్ రెడ్డి ను ఆశీర్వదించాలి అనీ మధు సూధన్ రెడ్డి కోరారు. ఇది ఇలా ఉంటే ఇందిర ఆర్థోపెడిక్ హాస్పిటల్ అధినేత డాక్టర్.వై సందేష్ రెడ్డి అనుభవజ్ఞులైన ఆర్థోపెడిక్ వైద్యులు ఆయన ఎం బి బి ఎస్, ఎం ఎస్, (ఆర్థో) చేసి ఎస్సార్ ఎం సి  చెన్నై( గోల్డ్ మెడికలిస్ట్)గా, ఫెలో ఇన్ జాయింట్ రిప్లేస్మెంట్( బోస్టన్. యు ఎస్ ఏ ఇన్ షోల్డర్ సర్జన్(సియోల్,ఎస్. రెమటాలజీ ( ముంబై- ఇండియా),ఫెలో ఇన్ ఆర్తోస్కోపిక్ సర్జరీ(సన్ షైన్ హాస్పిటల్ ,హైదరాబాద్)లో పనిచేసిన అనుభవం ఉంది.ఇంతవరకు గూడూరు పట్టణంలో ఇంత అనుభవజ్ఞులైన ఆర్థో వైద్యులు హోస్పెటల్ పెట్టలేదు. అంతేకాకుండా డాక్టర్.వై సందేష్ రెడ్డి  గూడూరు నియోజకవర్గ వాసి కావడం, ఆయన తండ్రి  యర్రటపల్లి మధు సూదన్ రెడ్డి   సౌమ్యులు ప్రముఖ పారిశ్రామిక వేత్త, సీనియర్ రాజకీయ నాయకులు కావడం,అందరికి సూపరిచితుడు ,ప్రజా  సేవకులు కావడంతో  ప్రజలకు  మంచి వైద్య సేవలు అందించేందుకు గూడూరులో హాస్పిటల్ ఏర్పాటు చేయడం నిజంగా గూడూరు ప్రజల అదృష్టం అనే చెప్పాలి.ఏది ఏమైనా ప్పటికి గూడూరు ప్రజలకు సేవలు అందించడానికి ముందుగా వచ్చిన డాక్టర్ వై.సందిష్ రెడ్డి కి స్థానిక ప్రజలు అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Indira Orthopedic Hospital opens in Gudur today

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page