పనిమనిషిని సన్మానించిన కృష్ణంరాజు…శభాష్ అంటున్న నెటిజన్లు 

0 9,712

హైదరాబాద్‌ ముచ్చట్లు:

 

తమ ఇంట్లో పని చేస్తున్న పద్మ అనే పనిమనిషిని రెబల్ స్టార్ కృష్ణంరాజు ఘనంగా సన్మానించారు. 25 ఏళ్లుగా ఆమె కృష్ణంరాజు ఇంట్లో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ’25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్’ అంటూ ఆమెతో కేక్ కట్ చేయించారు. పద్మకు కృష్ణంరాజు భార్య బంగారు చైన్ ని కానుకగా ఇచ్చినట్టు సమాచారం.ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను కృష్ణంరాజు కూతురు ప్రసీద సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ’25 ఏళ్లుగా మాకోసం ఎంతో చేశారు. థాంక్యూ పద్మ ఆంటీ’ అని ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పనిమనిషిని కూడా ఇంట్లో మనిషిగా చేసుకున్నారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Krishna Raju who honored the maid … Netizens who say Shabash

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page