ఏపీలో మ్యాటర్, మీటర్ ఇష్యు

0 7,589

విజయవాడ  ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌లోకి ఇలా చలికాలం ఎంటర్ అవుతుంటే.. రాజకీయాల్లో అలా హీట్ పెరిగిపోతూ ఉంది. రోజుకో ఇష్యూతో ఏపీ పాలిటిక్స్ గరం గరంగా మారుతున్నాయి. నిన్నటి వరకు అసభ్య పదజాలాలతో దాడి చేసుకున్న నేతలు.. ఇప్పుడు మగతనంలోకి దిగేశారు. ఒక నేత మ్యాటర్ లేదు.. మీటర్ లేయదంటే.. మరో నేత మ్యాటర్ వీక్‌గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్‌గా ఉంటుదంటూ మగతనం మీద చర్చలు పెట్టేసుకుంటున్నారు. ఇలాంటి విషయాల్లో ఏదైనా సలహా కావాలంటే డాక్టర్ సమరాన్ని సంప్రదించాలంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చేసుకుంటున్నారు… ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని పరుష పదజాలంతో విమర్శించారంటూ టీడీపీ కార్యాలయాలు, పట్టాభి ఇంటిని వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. పట్టాభి అరెస్టు.. కార్యాలయాలపై దాడిని నిరసిస్తూ నారా చంద్రబాబు నాయుడు 36 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. నారా లోకేష్ ప్రెస్‌మీట్ పెట్టి వడ్డీతో సహా చెల్లిస్తాం సిద్ధం ఉండండి అంటూ సవాల్ కూడా విసిరారు. దీంతో లోకేష్ లాంటి ఛాలెంజ్‌ను మేం స్వీకరించలేమని.. ముందు ఎమ్మెల్యేగా గెలిచి చూపించమని మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. లోకేష్ మగతనాన్ని టార్గెట్ చేస్తూ మ్యాటర్ లేదు.. మీటర్ లేయదని నెనెప్పుడో చెప్పానంటూ తనదైన శైలిలో విమర్శించారు.

- Advertisement -

అసలు ఎలిమినేటి మాధవరెడ్డి పోలికలు ఎందుకొచ్చాయో మీ నాన్నను అడుగూ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో వంశీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ఘాటుగా స్పందించారు. రెండ్రోజులు జర్నీ చేస్తే రెండ్నెల్లు పడుకునే నువ్వు కూడా మగతనం గురించి మాట్లాడుతున్నావా అంటూ ఎద్దేవా చేశారు.అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించిన టీడీపీ అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉద్దేశించి శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొగోడివి అవునో కాదో తెలుసుకోవాలంటే సమరం దగ్గర టెస్ట్‌కి పోవాలని.. మ్యాటర్ వీక్‌గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్‌గా ఉంటుందని డైలాగ్ రాసిన రైటర్ కూడా నీకు పరిచయమై.. నిన్ను చూసిన తర్వాతే ఆ డైలాగ్ రాసుంటారని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్‌ని ఇప్పుడు విమర్శిస్తున్నావని.. ఒకప్పుడు ఇదే లోకేష్, చంద్రబాబుని కలిసేందుకు ఎన్ని రోజులు పడిగాపులు కాశావో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. పరిటాల రవి, జూనియర్ ఎన్టీఆర్‌ని అమితంగా అభిమానిస్తానని చెప్పుకునే వంశీ.. వాళ్లని భూముల విషయంలో మోసం చేయలేదా అని ప్రశ్నించారు.పశువుల డాక్టర్‌గా చదువుకున్నానన్న ఒక పశువు.. తాడేపల్లి ప్యాలెస్ పెంపుడు కుక్క చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఏందో మ్యాటర్.. మీటర్.. మోటర్ గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు మొగోడివి కాదని.. నీకు మగతనం లేదని బయట చెప్పుకుంటుంటే.. నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావు.. నీలో ఉన్న లోపం గమనించకుండా ఉండేందుకు.. నువ్వు మగాడివో కాదో తెలుసుకోవాలంటే నువ్వు సమరం గారి దగ్గరికి టెస్టుకు పో.. తెలుసుకునే ప్రయత్నించే పని చెయ్.. నీకు సినిమా ఇండస్ట్రీతో పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టే.. నిన్ను చూసే రైటర్ మ్యాటర్ వీక్ అయితే పబ్లిసిటీ పీక్ అనే డైలాగ్ రాసుంటాడు. జూనియర్ ఎన్టీఆర్, పరిటాల రవిని భూ విషయాల్లో మోసం చేసింది నువ్వు. పరిటాల రవి హత్య సమయంలో సమాచారం చేరవేసింది కూడా నువ్వే అని జనాలు అనుకుంటున్నారు.. దానికి సమాధానం చెప్పు” అంటూ టీడీపీ అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Matter, meter issue in AP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page