పుంగనూరులో గ్రామ స్వరాజ్యపాలన పటిష్టం – ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి

0 9,679

పుంగనూరు ముచ్చట్లు:

 

మహాత్మగాంధి ఆశించిన గ్రామస్వరాజ్య పాలన పటిష్టం చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారని ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి కొనియాడారు. శనివారం మండలంలోని భీమగానిపల్లెలో ఎంపిడీవో లక్ష్మీపతి ఆధ్వర్యంలో సచివాలయము, ఆర్‌బికెల నిర్మాణాలకు భూమి పూజను ఎంపిపి చేసి, పనులు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు మండలంలో అన్ని సచివాలయాలకు, ఆర్‌బికెలు, వెల్‌నెస్‌ సెంటర్ల నిర్మాణాలు పూర్తికావస్తోందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఈ సమావేశంలో వైస్‌ ఎంపిపి ఈశ్వరమ్మ, పార్టీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్‌, రమణ, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; Strengthening village self-government in Punganur – MP Akkisani Bhaskar Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page