బిషాణ ఎత్తిపోయిన గడ…టీడీపీ-మంత్రి కన్నబాబు

0 75,783

తాడేపల్లి ముచ్చట్లు:

ఢిల్లీ వెళ్ళి బోషడీకే అంటే.. అక్కడ చెప్పు తీసుకు కొడతారు బాబూ..!  ఢిల్లీ వెళ్ళి బాగున్నారా అనడానికి బోషడీకే అని బాబు పిలుస్తారా..?  బూతులు తిట్టించడం టీడీపీ ఎత్తుగడ కాదు.. బిషాణ ఎత్తిపోయిన గడ అని మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి  కురసాల కన్నబాబు అన్నారు.   పాద నమస్కారాలు,  నోట్ల కట్టల దండలు వేయించుకున్నది చందాబాబానా లేక చంద్రబాబానా..?  సీబీఐని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని బీరాలు పలికి.. ఇప్పుడు అదే కావాలంటారా..?  ప్రభుత్వం మీద ఉగ్రవాదుల్లా దాడి  చేస్తున్నది టీడీపీనే.  పేదలకు సాయం చేస్తే చూడలేని ఉగ్రవాదులు మీరా.. మేమా…?  బజారు భాష మాట్లాడే వ్యక్తులను టీడీపీ వేదికలు ఎక్కించి బూతులు తిట్టించడం ఎక్కడి సంప్రదాయం..?  36 గంటల బాబు స్కిట్- డ్రామా.. అంతా బూతుల పంచాంగమే.  టీడీపీ తిట్ల దండకాన్ని 36 గంటలపాటు బాబు ఎంజాయ్ చేశాడు.  పేరుకి టీడీపీ జాతీయ పార్టీ, బద్వేల్, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయదు.  దుగ్గిరాలలో ఎంపీటీసీలను గెలిపించి బాబుకు లోకేష్ గిఫ్ట్ ఇస్తాడట..  లోకేష్ కామెడీ మాటలు చూసి బాబు కుమిలిపోయి ఉంటాడు.  కుప్పం మున్సిపాల్టీ ఎన్నికల్లో ముందు గెలవండి బాబూ…!  కేవలం కక్ష సాధించటం కోసమే టీడీపీ అధికారంలోకి రావాలనుకుంటుందా..?  వైయస్ఆర్సీపీ  కార్యకర్త మీద ఈగ వాలినా ఒప్పుకోని నాయకుడు  జగన్ అని అన్నారు.  బజారు భాష మాట్లాడిన పట్టాభి వ్యాఖ్యలను ఖండించి, బాబు క్షమాపణలు కోరతారనుకున్నాం.   చిటికె వేయండి..  సీఎం ఇంటిపై దాడి చేస్తామని అనడం ఉగ్రవాదం కాదా..?  పవన్ కల్యాణ్ తల్లి గురించి టీడీపీ హయాంలో కామెంట్ చేస్తే..   జగన్ స్పందించారు.  రాష్ట్రంలో ప్రతి పథకమూ మహిళల పేరుతోనే ఇస్తున్న ఏకైక ప్రభుత్వం.  కొంగ జపంలా.. నాలుగు ఓట్ల కోసమే బాబు దొంగ దీక్ష.  పారిపోవడం, దాక్కోవడం గురించి లోకేష్ మాట్లాడితే.. వారికే వర్తిస్తాయి.  గంజాయి మూలాలు టీడీపీలోనే ఉన్నాయి.  గంజాయి పండించుకుని బతుకుతున్నారని రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తారా..?  బాబు, లోకేష్ కు 2019 ఎన్నికల్లో  జగన్ సినిమా చూపించారు కదా… ఇంకా టైలర్స్ ఏంటి..?  ఆగ్రోస్ ను మూసి వేస్తున్నారన్న వార్తల్లో నిజం లేదు. ఇంకా బలోపేతం చేస్తున్నామని అన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:TDP-Minister Kannababu lifts the door

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page