వ్యర్థాల నిర్మూలన శాస్త్రీయంగా జరగాలి.

0 7,577

– జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్& సెషన్స్ జడ్జి డా.వి.రాధాక్రిష్ణ కృపా సాగర్

జిల్లాలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలి
– జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు

- Advertisement -

బయోమెడికల్ వేస్ట్ ను బాధ్యతగా తీసుకొని డిస్పోజల్ చేయాలి
జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి

కర్నూలు ముచ్చట్లు:

జిల్లాలో బయో మెడికల్ వేస్టు నిర్వహణ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా వంద శాతం అమల జరగాలి…ఇందుకోసం పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్& సెషన్స్ జడ్జి డా.వి.రాధాక్రిష్ణ కృపా సాగర్ అన్నారు.
శనివారం ఉదయం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కర్నూలు ఆధ్వర్యంలో బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ పాన్ ఇండియా అవెర్నేస్ అండ్ ఔట్ రిచ్ ప్రోగ్రాం అవగాహన కార్యక్రమం జరిగింది.అవగాహన కార్యక్రమంలో కర్నూలు జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్& సెషన్స్ జడ్జి డా.వి.రాధాక్రిష్ణ కృపా సాగర్, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ శ్రీనివాస రావ్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యం.సుబ్బయ్య, డి ఎం యచ్ ఓ డాక్టర్ రామ గిడ్డయ్య, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈఈ మునిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్& సెషన్స్ జడ్జి డా.వి.రాధాక్రిష్ణ కృపా సాగర్ మాట్లాడుతూ….బయోమెడికల్ వేస్ట్ ను చాలా ఆస్పత్రులు ఎక్కడపడితే అక్కడ పడవేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు.  జనరేట్ అవుతున్న బయోమెడికల్ వేస్ట్ ను పకడ్బందీగా డిస్పోజల్ చేయాలన్నారు. దీన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలన్నారు. కర్నూలు జిల్లాలో లీగల్ సర్వీస్ అథారిటీ చాలా బాగా పనిచేస్తుందన్నారు. బయో మెడికల్ వేస్ట్ ఎక్కడపడితే అక్కడ పడేయకుండా బాగా డిస్పోజల్ జరిగేలా బార్ కోడింగ్, జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం సమాజంలో ప్లాస్టిక్‌ వినియోగం మోతాదుకు మించిపోయిందని, దీని వలన వాతావరణ సమతౌల్యం దెబ్బతింటోందని చెప్పారు. దీని దృష్ట్యా ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లాలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలి – జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు :-

జిల్లాలో బయోమెడికల్ వేస్ట్ నిర్వహణ మరింత సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు అధికారులను ఆదేశించారు. 1986 లో బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ చట్టం రూపంలోకి రావడం జరిగిందని, 2016లో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ లో చేర్పులు, మార్పులు జరిగాయన్నారు. చట్టం రూపంలో చాలా క్లియర్ గా ఎలా డిస్పోజల్ చేయాలి వంటి విషయాలపై పొందుపరచడం జరిగిందన్నారు. జిల్లాలోని హాస్పిటల్, క్లినికల్, ప్రయోగశాలలు, నర్సింగ్ హోమ్ లో బయో మెడికల్ వ్యర్థ పదార్థాలు ఎక్కువగా జనరేట్ అవుతుందని, ఇవే కాకుండా ఇతరులు కూడా టన్నులకొద్దీ బయోమెడికల్ వేస్ట్ ను జనరేట్ చేస్తున్నారని, కోవిడ్ సమయంలో ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ వినియోగించిన మాస్క్ లను పడేయకుండా…బాధ్యతగా ఉండాలి…బాధ్యతగా డిస్పోజల్ చేయాలన్నారు. బయో మెడికల్ వేస్ట్, ఏ వ్యర్థాలు అయినా సరిగా డిస్పోజల్ చేయాలన్నారు. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ చట్టం బాగా అమలులోకి తీసుకు రావాలన్నారు. బయోమెడికల్ వేస్ట్ వల్ల ఎటువంటి పరిస్థితులు దారి తీస్తుందో, పర్యావరణం సమతుల్యత దెబ్బతిని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మేల్కొని వచ్చే తరానికి మంచి వాతావరణం ఇచ్చేందుకు బాధ్యతగా కృషి చేయాలన్నారు. అన్ని ఆస్పత్రుల్లో బయో వ్యర్థ పదార్థాల నిర్వహణకు అవసరమైన పటిష్టమైన చర్యలు ఉండేలా చూడాలన్నారు. రేపటి నుంచి వేస్ట్ మేనేజ్మెంట్ పై కార్యాచరణ రూపొందించాలన్నారు.

బయోమెడికల్ వేస్ట్ ను బాధ్యతగా తీసుకొని డిస్పోజల్ చేయాలి – జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి :-

చాలా ఆస్పత్రులు బయో వేస్టుని ఇష్టారాజ్యంగా పారేస్తోన్నారని, దీనిని పూర్తిగా అరికట్టాలన్నారు. తమ గ్రామంలో ఒక పశువు చనిపోతే, పశువును పోస్టుమార్టం చేస్తే, పశువు శరీరంలో సిరంజన్ లు ఉన్నాయని, తద్వారా పశువు మృతిచెందినట్లు తెలుస్తోందన్నారు. బయో మెడికల్ వేస్ట్ ఓ ప్రాంతంలో వేయడంతో, ఆ ప్రాంతం గడ్డి మొక్కలు మొలవడంతో పశువు గడ్డిలో ఉన్న సిరంజన్ లు, గడ్డితో పాటు మేతగా తీసుకోవడంతో పశువు మృతి చెందిందన్నారు. దీనిని బట్టి చూస్తే ఎంత ప్రమాదకరమో అర్థమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వేస్ట్ మేనేజ్మెంట్ ను బాధ్యతగా తీసుకొని డిస్పోజల్ చేయాలన్నారు. కోవిడ్ తర్వాత మూడింతల బయోమెడికల్ వేస్ట్ పెరిగిందన్నారు. బయోమెడికల్ వేస్ట్ సరిగా డిస్పోజల్ చెయ్యకపోతే చట్ట పరంగా కేసులు కూడా నమోదు చేయవచ్చన్నారు. బయోమెడికల్ వేస్ట్ వల్ల పర్యావరణానికి మరియు జంతువులు, మానవులకు ఏ ప్రాణికి కూడా ఎటువంటి హానీ కలగకుండా ఉండేలా డిస్పోజల్ చేయాలన్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Waste disposal should be done scientifically

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page