జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం కింద చేకూరే ప్రయోజనాలు

0 7,594

విజయవాడ    ముచ్చట్లు:

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం (ఓటీఎస్) ద్వారా లబ్ధిదారులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. లబ్ధిదారుడు నామమాత్రపు మొత్తాన్ని చెల్లించినప్పుడు భూమిపై హక్కులు సంక్రమిస్తాయన్నారు.  లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్ పొందవచ్చన్నారు.  సదరు ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ను తనఖా పెట్టి “బ్యాంకు లోను” పొందే అవకాశం కూడా ఈ పధకం ద్వారా లబ్ధిదారులకు వుందన్నారు. లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉపయోగించి ఇంటిని బదిలీ చేసుకోవడానికి, అమ్మడానికి లేదా లీజుకు ఇవ్వడానికి హక్కులు కలిగి వుంటారని ఆప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఓటీఎస్ పధకం కింద చెల్లించవలసిన వివరాలను వెల్లడిస్తూ కేటగిరీ-ఏ కింద  ఇంటిపై అప్పు తీసుకున్న లబ్ధిదారుడు లేదా వారసుడు  గ్రామీణ ప్రాంతమైతే రూ.10,000/-, మునిసిపాలిటీలో రూ. 15,000/-, మునిసిపల్ కార్పొరేషన్ లో రూ.20,000/-   రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించవలసి వుంటుందన్నారు.  కేటగిరీ-బి కింద ఇంటిపై అప్పు తీసుకున్న లబ్దదారుడు లేదా కొనుగోలు దారుడు గ్రామీణ రూ. 20,000/-, మునిసిపాలిటీ రూ.30,000/- మున్సిపాల్ కార్పొరేషన్ లో రూ. 40,000/- రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాలన్నారు. కేటగిరీ సి కింద అప్పులేని లబ్ధిదారుడు లేదా వారసుడు కేవలం  రూ.10 లు మాత్రమే రిజిస్ట్రేషన్ ఛార్జి చెల్లిస్తే సరిపోతుందన్నారు.  కేటగిరీ- డి కింద అప్పు తీసుకొననని అనుభవదారు లేదా కొనుగోలు దారుడు గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000/-, మున్సిపాలిటీ .  15,000/-, మున్సిపల్ కార్పొరేషన్ లో రూ.20,000/- రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించి తమ పేరుపై రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్  పొందవచ్చునన్నారు.   సదరు లబ్ధిదారులు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Benefits under Jagannath Absolute Home Rights Scheme

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page