బీజేపీ నేతలవి మొండి, తొండి మాటలు.

0 7,578

హుజూర్ నగర్  ముచ్చట్లు:

కరీంనగర్ జిల్లా  వీణవంక మండలం చల్లూరులో టిఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మంత్రి హరీష్ రావు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, వివేకానంద్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ వీణవంకలో సమావేశం పెట్టిన బిజెపి వాళ్లు అన్ని మొండి మాటలు.. తొండి మాటలు చెప్పారు. ఒకే నెలలో 18 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. యాసంగిలో రైతు పెట్టుబడి రూ. 6 వేలు అయింది.. ఇంకా బీజేపీకి ఓటేస్తామా? గెలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పాల్సింది పోయి.. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కిషన్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారు.. దీనిపై మాట్లాడడానికి జమ్మికుంట గాంధీ చౌరస్తా, జమ్మికుంట, చల్లూరుకు వస్తావా? పెట్రోల్, డీజిల్ ధర రూ. 100 లో రూ. 32 కేంద్రానికి పోతున్నాయి. ఏడేళ్లలో కేంద్ర పన్నులు 4 రూపాయల నుంచి.. 32 రూపాయలకు పెంచిన ఘనత బిజెపికే దక్కుతుంది. పెట్రోల్, డీజిల్ తో రైతులపై భారం పడటం లేదా? ఓ కేంద్ర మంత్రి పెట్రోల్, డీజిల్ ధరలతో 90 శాతం మంది ప్రజలకు సంబంధం లేదని అంటున్నాడు.. డీజిల్, పెట్రోల్ అవసరం లేని మనిషి ఉన్నాడా?  కేంద్రమంత్రులు, బిజెపి నాయకులు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. ఈటెల రాజేందర్ చేరిన బీజేపీ గ్యాస్ ధరను రూ. 500 నుంచి వెయ్యి రూపాయలకు పెంచింది.. సబ్సిడీని పూర్తిగా ఎగగొట్టింది.   గ్యాస్ సిలిండర్ పై రూ. 291 రాష్ట్ర ప్రభుత్వం పన్ను విధిస్తుందన్న ఈటెల మాటలకు.. అదే నిజమైతే ఆర్థిక మంత్రిగా పదవికి రాజీనామా చేస్తానని చాలెంజ్ చేస్తే పది రోజులైనా పత్తా లేడు. గ్యాస్ సిలిండర్ పై మరో రూ. 200 పెంచేందుకు సిద్ధంగా ఉన్నారు. గ్యాస్ సిలిండర్ ధర నవంబర్ 2న రూ. 1,250 కాబోతుంది.. మరో ఏడాది అయితే రూ. 2 వేలు అవుతుంది. పేద ప్రజలపై ప్రేమ ఉంటే 500 రూపాయలు సబ్సిడీ ఇవ్వాలి.. గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలి. బిజెపికి ఓటు వేయడం అంటే మన వేలితో మన కన్ను పొడుచుకున్నట్టే. కెసిఆర్ కిట్ లో కేంద్రం రూ. 5 వేలు ఇస్తుందని ఈటెల అంటున్నారు..  బిజెపి ఇచ్చినట్లయితే వేరే రాష్ట్రంలో ఆ పథకం ఎందుకు లేదు. గొల్ల, కురుమలకు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ఇచ్చి రాజ్యాధికారమే చేతిలో పెట్టాం.

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినా.. ఇంకా ఓటేస్తామా? ఈటెలది నోరా.. మోరా? పూటకో మాట మాట్లాడుతున్న ఈటల రాజేందర్ ను ఏ రకంగా విశ్వసించాలి. ఉత్తరప్రదేశ్ లో వడ్లు కొనకుంటే రోడ్లపై పోసి తగల పెడుతున్నారు.. అక్కడ ఏ ప్రభుత్వం ఉంది. బిజెపి పాలిత రాష్ట్రాల్లో వడ్ల కొనడం లేదు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొంటుందా.. లేదా ఆలోచించాలి. మంత్రిగా ఉండి ఈటెల హైదరాబాద్ లో మెడికల్ కాలేజీ కట్టాడు కానీ.. పేద విద్యార్థుల కోసం ఒక డిగ్రీ కాలేజీ తేలేకపోయాడు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా.. రెండు సార్లు మంత్రిగా పని చేసి కనీసం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చాడా? యువకుల కష్టాలు యువకుడికే తెలుస్తాయి.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించండి. పేదవాళ్లకు, ఉద్యమకారులకు అవకాశం ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది. గొల్ల, కురుమల కుటుంబంలో పుట్టిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు రెండు గుంటల భూమే ఉంది. పేదింటి బిడ్డకు సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు.. తోటి విద్యార్థులుగా గెల్లు  శ్రీనుకు మీరంతా అండగా ఉండాలి. ఈటల రాజేందర్ గెలిస్తే అక్కడ చేతులు కట్టుకుని నిలబడాలి.. గెల్లు శ్రీనివాస్ గెలిస్తే దోస్తులాగా యువకుల్లో యువకుడిగా కలవచ్చు. ఢిల్లీ వాళ్ళు కావాలా.. గల్లీలో ఉండి పని చేసే వాళ్ళు కావాలా తేల్చుకోవాలి. ఈటల రాజేందర్ ను ఎన్నిసార్లు అడిగినా.. దీక్షలు చేసి ధర్నాలు చేసినా చల్లూరును మండలం చేయలేదు. చల్లూరు సీతారామస్వామి సాక్షిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపిస్తే.. 3 నెలల్లో మండలంగా చేస్తాం. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిపించుకుందాం.. చల్లూరు మండలంగా సాధించుకుందాం. మెదక్ లో చెల్లని రూపాయి వీణవంకలో చెల్లుతదా. నా పుణ్యాన విజయశాంతి ఎంపీగా గెలిచిందని అన్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:BJP leaders are stubborn

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page