సీఎం కేసీఆర్ మహా నాయకుడు- హరీష్ రావు

0 7,561

తెలంగాణముచట్లు:

సీఎం కేసీఆర్‌. మహానాయకుడు అంటూ తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు కొనియాడారు.టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైనా కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి హరీశ్ రావు.ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం ఆ ఉద్యమాన్ని గమ్యస్థానానికి చేర్చడం ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనాయకుడు మన కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం పదవులను గడ్డి పోచలుగా త్యాగం చేసి టీఆర్ ఎస్ పార్టీని స్థాపించి తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టిన ఉద్యమ ధీశాలి మన కేసీఆర్ అని ప్రశంసించారు.ఉద్యమ స్పూర్తితోనే బంగారు తెలంగాణ కు బాటలు వేస్తూ అభివృద్ధి , సంక్షేమ ఫలాలను సబ్బండ వర్గాలకు అందిస్తున్న దేశం గర్వించదగ్గ పరిపాలన దక్షుడు మన కేసీఆర్ అని కొనియాడారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో , ప్రజల ఇంటి పార్టీ గా 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరో సారి టీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సీఎం కేసీఆర్‌కు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు హరీష్‌ రావు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:CM KCR Great Leader- Harish Rao

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page