రైల్వే ప్రయాణికుల అందోళన.

0 7,576

హిందూపురం    ముచ్చట్లు:

ఎక్స్ ప్రెస్ రైళ్లలో పాసులు అనుమతించడం లేదంటూ అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రయాణికులు ఆందోళనకు దిగడంతో గంట పాటు హిందూపురం రైల్వే స్టేషన్లో ఆగిపోయిన కాచిగూడ యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ రైలు.  హిందూపురం నుండి బెంగళూరుకు ఉద్యోగరీత్యా వెళ్లే ఉద్యోగస్తులు నెలవారీ పాసులు తీసుకొని ప్రయాణం సాగిస్తుంటారు. అయితే కొంతకాలంగా పాసులను అనుమతి నిరాకరిస్తూ వారికి జరిమానా విధిస్తూ ఉండడంతో ప్రయాణికులు పట్టాలపైకి నిరసనకు దిగారు దీంతో కాచిగూడ నుండి బెంగళూరు యశ్వంతపూర్ కు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు హిందూపురం రైల్వే స్టేషన్ లో గంట పాటు ఆగిపోయింది దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది రైల్వే పోలీసులు అధికారులు ఆందోళనకారులకు సర్దిచెప్పి తాత్కాలికంగా సమస్యకు పరిష్కారం చూపడంతో ఆందోళన విరమించారు దీంతో హిందూపురం రైల్వే స్టేషన్ నుండి యశ్వంత్పూర్ కాచిగూడ రైలు గంట ఆలస్యంగా బయలుదేరి వెళ్ళింది.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Concern of railway passengers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page