ఎయిడెడ్ పాఠశాలల మూసివేతపై అందోళన.

0 7,858

విశాఖపట్నం  ముచ్చట్లు:

విశాఖలో విద్యార్ధుల తల్లితండ్రులు ఆందోళనకు దిగారు.నగరంలోని జ్ఞానాపురంలో ఉన్న సెంట్ ఆన్స్, సెయింట్ జోసఫ్తోపాటు సమీపంలోని పలు ఎయిడెడ్ పాఠశాలలు మూసివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో తల్లితండ్రులు ఆందోళకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళనకు దిగారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తామని గతంలో జీవో జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తున్నారు. అయితే ప్రభుత్వ సంస్థలు ఉండాలి.. లేదా ప్రైవేటు పరం చేయాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో సెంట్ ఆన్స్, సెయింట్ జోసఫ్తోపాటు సమీపంలోని పలు ఎయిడెడ్ పాఠశాలలు మూసివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. పిల్లలను వేరే స్కూల్లో చేర్చుకోవాలని, సిబ్బందికి జీతాలు ఇచ్చుకోలేమని యాజమాన్యాలు  చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో అక్కడకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమకు ఈ పాఠశాలలు, కళాశాలలే కావాలని, అమ్మఒడి అవసరం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు స్పష్టం చేశారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Concern over closure of aided schools

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page