జువెలర్స్ కు కుచ్చుటోపి

0 7,574

మేడ్చల్    ముచ్చట్లు:

అధికారినంటూ బంగారం షాపు నిర్వాహకుడికి మాయమాటలతో బురిడీ కొట్టించి 1.60 లక్షల సొత్తుతో ఉడాయించాడు ఓ కేటుగాడు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లోని ఐమాత జివెల్లెర్స్ దుకాణంలో ఈనెల 21న  ఇన్ కం టాక్స్ డిపార్ట్మెంట్ అధికారినంటూ పరిచయం చేసుకొని బంగారం కొనుగోలు చేయడానికి వచ్చాడు ఓ వ్యక్తి. యజమానికి మాయమాటలు చెప్పి రూ.1.60 లక్షల బంగారపు సొత్తు కొనుగోలు చేసాడు సదరు వ్యక్తి. అనంతరం నగదును ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి.. అరగంట లో నగదు తన ఖాతాలో క్రెడిట్  అవుతుందని నమ్మబలికి అక్కడినుంచి పరారయ్యాడు కేటుగాడు.  క్యాబ్ డ్రైవర్ ను మోసం చేయడంతో వెలుగులోకి అనంతరం జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డులో కారులో వెళ్తూ మార్గమద్యలో ఆగాడు కేటుగాడు. ఇప్పుడే వస్తానని డ్రైవర్ కి చెప్పి అక్కడినుంచి పరారయ్యాడు.  అయితే కేటుగాడు ఎంతకూ రాకపోవడంతో ఆ వ్యక్తి జివెల్లెర్స్ దుకాణానికి వెళ్ళాడేమో  అనుకుని  క్యాబ్ డ్రైవర్ అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ కూడా సదరు వ్యక్తి ఆచూకీ లభించలేదు. దుకానపు యజమానికి తాను క్యాబ్ డ్రైవర్ ను అని ఒకరోజుకు 5వేలకు కారును బుక్ చేసుకుని మోసం చేశాడని  బంగారపు దుకాణం యజమానికి విషయం చెప్పగా…తనను కూడా నమ్మించి రూ.1.5లక్షల బంగారు సొత్తును తీసుకుని మోసం చేసినట్లు గ్రహించి పెట్ బషీరాబాద్ పోలీసులకి పిర్యాదు చేసాడు బంగారం దుకాణం యజమాని  బాధితుడు తన్నారామ్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు….

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Cufflinks for Jewelers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page