ప్రతి అభిమాని సైనికుడిలా పని చేయాలి- జనసేన నేత వైపి క్రాంతి కుమార్

0 7,563

పత్తికొండ ముచ్చట్లు:

రానున్న రోజుల్లో మెగా ఫ్యామిలీ చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమాన్ని ప్రతి అభిమాని  సైనికుడిలా పనిచేయాలని పత్తికొండ తాలూకు జనసేన నాయకులు వైపి క్రాంతి కుమార్ ,  గోవిందు లు కోరారు సోమవారం వారు   విలేఖరులతో మాట్లాడుతూ కర్నూలు నగరంలో అఖిలభారత చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడు చింత సురేష్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా ఫ్యామిలీ అభిమానుల డిజిటల్ కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది అని తెలిపారు. మెగా ఫ్యామిలీ చేసే ప్రతి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఇందులో భాగస్వాములు చేయడం బాధ్యతగా చేస్తామని కావున నియోజకవర్గంలోని ప్రతి అభిమాని ఒక సైనికుడిలా పనిచేసేందుకు సిద్ధపడాలని కోరారు. సరైన సమయంలో రక్తం అందుబాటులో లేక అనేక మంది మృతి చెందిన సంఘటన తెలుసుకొని చెల్లించిన మెగా ఫ్యామిలీ కని వినీ ఎరుగని రీతిలో బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేసి ఎంతోమందికి రక్తం అందించడమే  కాక అభిమానుల ప్రోత్సాహంతో రక్తదాన శిబిరాలను ఏర్పాటు కు పిలుపునిచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే అన్నారు. అదే స్ఫూర్తితో మెగా ఫ్యామిలీ ఎన్నో సేవా కార్యక్రమాలు  చేస్తుందని అన్నారు.  ప్రస్తుతం అదే బాటలో పయనించేందుకు మాతోపాటు ప్రతి అభిమాని కలసి రావాలని కోరారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Every fan should work like a soldier- Janasena leader VP Kranti Kumar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page