శ్రమజీవి వృద్ధుల ఆశ్రమంలో ఎంపీ ఆదాల జన్మదిన వేడుకలు.

0 75,566

వృద్ధులకు పౌష్టికాహార అల్పాహారం, పండ్లు, బ్రెడ్లు పంపిణీ

నెల్లూరు  ముచ్చట్లు:

- Advertisement -

నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి  జన్మదినం సందర్భంగా కొడవలూరు మండలం, రామన్నపాలెం గ్రామంలో “శ్రమజీవి వృద్దుల ఆశ్రమం”లో అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది.
ముఖ్యఅతిథిగా విజయ డైరీ చైర్మన్ గౌ” శ్రీ కొండ్రెడ్డి రంగారెడ్డి  పాల్గొన్నారు.
డా” పేనేటి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో, ఆదాల అభిమాని ఈదురు ప్రసన్న మరియు వారి మిత్రుల పర్యవేక్షణలో ఆదాల జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా రంగారెడ్డి  కేక్ కట్ చేసి జన్మదిన కార్యక్రమాన్ని ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఆదాము అభిమాని ఈదూరు ప్రసన్న మాట్లాడుతూ సౌమ్యులు, స్నేహశీలి, ఉదార స్వభావం కలిగిన దాత, సీనియర్ రాజకీయ నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి నిండు నూరేళ్లు, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధుల అందరికీ పౌష్టికాహారంతో కూడిన అల్పాహార విందు మరియు యు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు .ఈ సందర్భంగా వృద్ధుల అందరూ ఆదాల ప్రభాకర్ రెడ్డి  మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలు,ఐశ్వర్యంతో వర్ధిల్లాలని వారి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు కార్యకర్తలతోపాటు ఆదాల అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:MP Adala’s birthday celebrations at Shramajivi old age home

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page