అగ్గిపెట్టు పెరిగిందోచ్

0 9,862

హైదరాబాద్ ముచ్చట్లు:

 

పోతే ఎన్నో ఎన్నో వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఇందులో భాగంగా తానేం తక్కువ కాదన్నట్లుగా అగ్గిపెట్టె ధర కూడా రెట్టింపు కానుంది. ఇన్ని రోజుల నుంచి 1 రూపాయికి మాత్రమే దొరికి అగ్గిపెట్టె ఇకపై 2 రూపాయలకు చేరుకోనుంది. తాజాగా అగ్గిపెట్టె తయారీదార్లకు సంబంధించిన ఐదు కీలక సంఘాలు తాజాగా తమిళనాడులోని శివకాశీలో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నాయి. దేశంలో చివరిసారి 14 సంవత్సరాల క్రితం అంటే 2007లో అగ్గిపెట్టె ధర 50 పైసలు ఉండగా, 1 రూపాయికి చేరుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1 రూపాయి ఉన్న ధర ఇప్పుడు 2 రూపాయలకు చేరుకుంది. దీంతో ఇప్పటివరకు 600 అగ్గిపెట్టెల బాక్సును రూ.270-300కి తయారీదార్లు విక్రయిస్తుండగా, ఇక నుంచి రూ.430-480కి పెంచాలని సంఘాలు సమావేశంలో నిర్ణయించాయి. దీనికి అదనంగా 12 శాతం జీఎస్టీ, రవాణా చార్జీలు ఉంటాయని నేషనల్‌ స్మాల్‌ మ్యాచ్‌బాక్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది.అగ్గి పెట్టె ధర 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు పెరగనుంది. ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి అగ్గి పెట్టెను రూ.2 చొప్పున విక్రయిస్తామని తయారీ సంస్థల సమాఖ్య ‘ఆలిండియా ఛాంబర్ ఆఫ్ మ్యాచెస్’ ప్రకటించింది. అగ్గిపుల్లల తయారీలో వినియోగించే 14 రకాల ముడి సరుకుల ధరలు భారీగా పెరగడం కారణంగానే ధరను పెంచాల్సి వస్తోందని తెలిపింది.అగ్గి పుల్లల తయారీలో ముఖ్యంగా ఉపయోగించే రెడ్‌ ఫాస్ఫరస్‌ ధర రూ.425 నుంచి రూ.810కు, మైనం ధర రూ.58 నుంచి రూ.80కి పెరిగిందని, అగ్గి పెట్టెల బాక్స్‌ బోర్డులు, పేపర్‌, పొటాషియం క్లోరేట్‌, సల్ఫర్ వంటి ముడి పదార్థాల ధరరూ పెరిగిపోయాయని, అందు వల్ల ధర పెంచాల్సి వస్తోందని ‘ఆలిండియా ఛాంబర్ ఆఫ్ మ్యాచెస్’ చెబుతోంది.పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్నంటుతుండటంతో అగ్గి పెట్టెల రవాణా ఛార్జీలు భారమయ్యాయని, మరో అవకాశం లేక మరో దారి లేని అగ్గిపెట్టే ధర రెట్టింపు చేయాల్సి వస్తోందని వెల్లడించింది.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: The matchstick grew

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page