హుజురాబాద్ లో గెల్లు గెలుపు ఖాయం-కేసీఆర్

0 7,563

హైదరాబాద్  ముచ్చట్లు:

హుజూరాబాద్ లో అధికార టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా, గెల్లు గెలుపును ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.హైటెక్స్ లో జరుగుతున్న టిఆర్ఎస్ ప్లీనరీలో సిఎం కెసిఆర్ అధ్యక్షోపన్యాసం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం వివక్షపూరితంగా వ్యవహరిస్తుందని కెసిఆర్ మండిపడ్డారు. ఎన్నికల సంఘం కూడా రాజ్యాంగ పరిధిలోకి వస్తుందని, అయితే తన పరిధిని దాటి ప్రవర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చిల్లర మల్లర ప్రయత్నాలు మానుకోవాలని ఆయన సూచించారు.హుజూరాబాద్ లో కెసిఆర్ సభ పెట్టొద్దని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన తెలిపారు.నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్బంగా కూడా తన సభ పెట్టొద్దంటూ కొందరు కోర్టులో కేసులు వేశారని ఆయన చెప్పారు. హుజూరాబాద్ లో సభ పెట్టకుండా కొందరు కుటిలయత్రాలు చేస్తున్నారని ఆయన ద్వజమెత్తారు. హుజూరాబాద్ పరిధిలోని దళితులు అదృష్టవంతులు, నవంబరు 4 తర్వాత దళితబంధు యథావిధిగా అమలు చేస్తామని కెసిఆర్ చెప్పారు. హుజూరాబాద్ ప్రజల ఆశీస్సులు తమ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు ఉన్నాయని, గెల్లు గెలిచి తీరుతారని కెసిఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Winning in Huzurabad is guaranteed-KCR

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page