28న 18వ ఏసియ‌న్‌-ఇండియా శిఖ‌రాగ్ర స‌ద‌స్సు

0 9,693

–  హాజ‌రుకానున్న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ

 

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

 

- Advertisement -

ఈ నెల 28న 18వ ఏసియ‌న్‌-ఇండియా శిఖ‌రాగ్ర స‌ద‌స్సు జ‌రుగనుంది. వ‌ర్చువ‌ల్ విధానంలో జ‌రుగ‌నున్న ఈ సద‌స్సుకు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతోపాటు వివిధ దేశాల అధినేత‌లు హాజ‌రుకానున్నారు. బ్రూనై సుల్తాన్‌ ఆహ్వానం మేరకు ప్ర‌ధాని ఈ కార్యక్రమానికి వ‌స్తున్నారు. ఇక ఏసియ‌న్‌-ఇండియా స‌మ్మిట్‌కు ముందు ఈ నెల 27న జరిగే 16వ తూర్పు ఆసియా దేశాల స‌ద‌స్సులో కూడా ప్ర‌ధాని మోదీ పాల్గొననున్నారు.ఏసియ‌న్‌-ఇండియా స‌ద‌స్సులో భార‌త్‌, ఆసియా దేశాల మ‌ధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ప‌రిస్థితుల‌పై సమీక్ష నిర్వ‌హిస్తారు. అదేవిధంగా కొవిడ్‌-19, ఆరోగ్యం, వాణిజ్యం, వ్యాపారం, అనుసంధానం, విద్య, సంస్కృతితోపాటు ప‌లు కీలకరంగాల్లో సాధించిన పురోగతిపై ఈ స‌మావేశంలో సమీక్షిస్తారని భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా అనంతర ఆర్థిక పురోగతితో సహా ముఖ్యమైన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా చ‌ర్చించ‌నున్నారు.గత ఏడాది నవంబర్‌లో జరిగిన 17వ ఏసియ‌న్‌-ఇండియా శిఖరాగ్ర సమావేశానికి కూడా ప్రధాని హాజరయ్యారని, ఈ ఏడాది పాల్గొంటే 9వ సారి ఆయ‌న ఈ స‌ద‌స్సుల్లో పాల్గొన్న‌ట్లు అవుతుంద‌ని విదేశాంగ‌శాఖ వెల్ల‌డించింది.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: 18th Asian-India Summit on 28th

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page