షర్మిలకు వైయస్సార్ చిత్రపటం బహూకరించిన జగదీశ్వర్ గుప్తా

0 9,666

మల్కాజిగిరి ముచ్చట్లు:

దివంగత మహానేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాన్ని ఆయన కుమార్తె వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల కు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు తడక జగదీశ్వర్ గుప్తా బహూకరించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో మంగళవారం చేపట్టిన నిరుద్యోగ నిరాహార దీక్షలో పాల్గొని షర్మిలకు చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గుప్తా మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అన్నారు. పేద ప్రజల కోసం వైఎస్సార్ ఇంకా ఎంతో చేయాలనుకున్నారని అర్ధాంతరంగా ఆయన మన నుండి దూరమవడం బాధాకరమైన విషయం అన్నారు. వైయస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణ ప్రజలకు సంక్షేమ పాలన అందించాలనే లక్ష్యంతో షర్మిల మన ముందుకు వచ్చారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో షర్మిల నేతృత్వంలోని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; Jagadeeshwar Gupta presents Yasser portrait to Sharmila

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page