గెల్లు గెలుపుతోనే  గ్రామాల అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

0 9,685

హుజూరాబాద్ ముచ్చట్లు:

 

హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీణవంక మండలం మామిడాలపల్లి, గొల్లపల్లి గ్రామాలలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో తెరాస  అధికారంలో ఉన్నందున గెల్లు శ్రీనివాస్ ను గెలిపిస్తే ప్రభుత్వం గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంది. 70 సంవత్సరాల నుండి జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో  అనేక కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. కులవృత్తులకు చేయూత అందించిన ప్రభుత్వం తెరాస అని అన్నారు. గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ, రైతులకు పంట పెట్టుబడి కోసం  ఎకరానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్  కే దక్కుతుంది. బీజేపీ  నేతలు విమర్శలు మాని ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రం నిధులు తీసుకురావాలి. అభివృద్ధి పనులు కొనసాగాలంటే  లాలహీన వర్గాల బిడ్డ గెల్లు శ్రీనివాస్ కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; Rural Development Minister Talsani Srinivas Yadav with the win

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page