అత్యాచారానికి గురైన వివాహిత

0 9,695

-ముద్దాయిని పటించిన దిశా యాప్
– మహిళలు పరాయి వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకండి
-రామచంద్రపురం డిఎస్పి బాలచంద్రారెడ్డి

 

రామచంద్రాపురం ముచ్చట్లు:

 

- Advertisement -

ప్రమాదాల్లో ఉన్న మహిళలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన “దిశా” వంటి యాప్ ను అందుబాటులోకి తెచ్చినా… ఏదో మూల మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.  దీంట్లో భాగంగా మండపేటకు చెందిన ఓ వివాహితపై అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి మండపేట రూరల్ సిఐ శివ గణేష్, ఆలమూరు ఎస్ఐ శివప్రసాద్ లతో కలిసి రామచంద్రపురం డిఎస్పి బాలచంద్రారెడ్డి ఆలమూరు పోలీస్ స్టేషన్లో  మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. డిఎస్పీ మాట్లాడుతూ… ఈనెల 23వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ గ్రామ ప్రాంతము నుండి “దిశ” యాప్ కు ఫోన్ రావడంతో ఫోన్ కాల్ ఆధారంగా మండపేట రూరల్ సిఐ శివ గణేష్, ఆలమూరు ఎస్ఐ శివప్రసాద్ సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని ఆ ప్రాంతమంతా పరిశీలన చేయగా అక్కడ ఎవరూ లేకపోవడంతో వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. కాగా “దిశా” యాప్ వచ్చిన ఫోన్ నెంబర్ తో అనుసంధానమైన (కాంటాక్ట్ నెంబర్ లు)మరో కొన్ని ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసినా బాధితురాలిని గుర్తించలేకపోయారు. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా సిఐ సమీపంలో గల అన్ని ఆస్పత్రులను తనిఖీలు చేయగా… మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతున్నట్లు గుర్తించి వివరాలు సేకరించారు.

 

 

బాధితురాలి నుండి సేకరించిన వివరాలు ప్రకారం భర్తకు దూరంగా ఉంటున్న వివాహిత తన తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండేందుకు ఓ అద్దె ఇల్లు చూస్తుండగా మూడు నెలల క్రితం పరిచయం అయిన వెదురుమూడి చెందిన అంగర రాఘవులు ఈమె పరిస్థితిని ఆసరాగా తీసుకుని పథకం ప్రకారం ఆమెను అత్యాచారం చేయాలనే ఉద్దేశంతో తన స్నేహితుడైన దుర్గా ప్రసాద్ తో కలిసి ఈనెల 22వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో బాధితురాలికి అద్దె ఇల్లు చూపిస్తానని చెప్పి తన ద్విచక్రవాహనంపై జొన్నాడ వైపు తీసుకు వస్తుండగా బాధితురాలు తన ఇంటి వద్ద దింపమని ప్రాధేయపడింది.  తన బంధువుల ఇంటి వద్ద ఈ రాత్రికి ఉండి రేపు ఉదయాన్నే మీ ఇంటి వద్ద దింపుతానని నమ్మబలికి గుర్తు తెలియని ప్రదేశంలో ఉన్న  ఇంటికి తీసుకుని వెళ్లి రాఘవులు ఆమెను అత్యాచారం చేశాడని బాధితురాలు తన వాంగ్మూలంలో తెలిపినట్లు డిఎస్పీ తెలిపారు. కాగా బాధితురాలు “దిశ” యాప్ సహాయం కొరకు ఫోన్ చేయగా రాఘవులు ఫోన్ లాక్కుని స్విచ్ ఆఫ్ చేయడంతో సంఘటన స్థలానికి పోలీసులు వెళ్ళిన ఆచూకీ లభ్యం కాలేదు. కాగా దిశ యాప్ కు వచ్చిన లొకేషన్ ఆధారంగా బాధితురాలిని సంఘటన స్థలానికి తీసుకువెళ్లడంతో గుర్తు పెట్టినట్లు డీఎస్పీ వెల్లడించారు. దీనిపై ముద్దాయి రాఘవులును అరెస్టు చేయగా, అతనికి సహకరించిన దుర్గాప్రసాద్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ కేసు కేవలం దిశ యాప్ ద్వారానే నేర స్థలాన్ని గుర్తించడం సులభతరమైయ్యిందని పోలీసులు తెలిపారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: A married woman who has been raped

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page