పిల్లలందరూ తప్పనిసరిగా స్కూళ్లకు..

0 9,666

-రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్రం

 

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

- Advertisement -

గ్రామాల్లో పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలలకు వెళ్లేలా ఆయా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని కేంద్ర పంచాయతీరాజ్శాఖ సూచించింది. నూరుశాతం హాజరు, సున్నా డ్రాపవుట్లు లక్ష్యంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని కోరింది. అక్షరాస్యత, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కేంద్రాలైన పాఠశాలల్ని అభివృద్ధి చేసేందుకు ఆర్థిక సంఘం నిధులు వినియోగించాలంది. గ్రామ పంచాయతీల వద్ద ఇప్పటికే అందుబాటులో గల 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు త్వరలో విడుదల చేయనున్న 15వ ఆర్థిక సంఘం నిధులనూ ఖర్చుచేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ కార్యదర్శి సునీల్కుమార్ లేఖ రాశారు. గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ ఆస్తులు, భవనాల నిర్వహణ చేపట్టాలని, ఆర్థిక సంఘం నిధులతో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, ఎరువుల కేంద్రాలకు వాడుకోవాలని కేంద్రం తెలిపింది.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; All children must go to school.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page