హైదరాబాద్ సిటీలో మరో ఫ్లైఓవర్

0 9,699

హైదరాబాద్ ముచ్చట్లు:

 

హైదరాబాదీలకు మరో శుభవార్త. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. నగరంలో అతిప్రధాన రహదారుల్లో ఇది కూడా ఒకటి.  విశ్వనగరంగా వడివడిగా అడుగులేస్తున్న హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యలు, ప్రయాణ దూరం తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నది. ముఖ్యంగా ప్రధాన రహదారులపై రద్దీని తగ్గించేందుకు నిర్మిస్తున్న అనుసంధాన రోడ్లు ట్రాఫిక్‌ సమస్యకు చక్కటి పరిష్కార మార్గాలను చూపిస్తున్నాయి. వీటి వల్ల సమయం ఆదా అవ్వడమే కాదు.. దూరం దగ్గరై.. గమ్యస్థానానికి ప్రయాణం సాఫీగా సాగిపోతున్నది.త్వరలోనే మరో  నగర ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన నేపథ్యంలో కష్టతరం కాకుండా మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని సంకల్పంతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో బి.టి.రోడ్లను, అవసరమైన చోట ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు, అండర్ పాస్ లు నిర్మించి హైదరాబాద్ ప్రాముఖ్యతను మరింతగా పెపొందించేందుకు విశేష కృషిచేస్తుంది.గచ్చిబౌలి ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్‌, సైబర్‌టవర్స్‌, నానక్‌రాంగూడ వేవ్‌రాక్‌ ప్రాంతాల్లోని ఐటీ కంపెనీలకు ప్రధాన కూడలి రాయదుర్గం బయోడైవర్సిటీ జంక్షన్‌. ఇక్కడ పలు లింకు రోడ్లతోపాటు రెండు ఫ్లై ఓవర్లను నిర్మించారు. ఫలితంగా గచ్చిబౌలి, మాదాపూర్‌, కొండాపూర్‌, శేరిలింగంపల్లి ప్రాంతాలకు రాకపోకలు సులువయ్యాయి.అయితే నగరంలోని పలు రోడ్ల నిర్మాణాలను చేపట్టేందుకు నిర్ణయించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.

 

 

 

- Advertisement -

మంత్రి కేటీఆర్. మేయర్ గద్వాల విజయ లక్ష్మి ఎప్పటి కప్పుడు పర్యవేశిస్తూ పనుల వేగవంతం గా జరిగేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో రేతిబౌలి నుండి గచ్చిబౌలి వరకు ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు 6 లేన్ల గల రెండు ఫ్లైఓవర్లు వయా షేక్ పేట్ ఫిలింనగర్ జంక్షన్ ఓయు కాలనీ జంక్షన్, విస్పర్ వ్యాలీ జంక్షన్ వరకు నిర్మించే షేక్ పేట్ ఫ్లైఓవర్ ఇంటర్మిడియట్ రింగ్ రోడ్ నిర్మాణం త్వరలోనే పూర్తి కానున్నది.హైటెక్ సిటీ వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రజలకు ఈ మధ్యంతర రింగ్ రోడ్ నిర్మాణం వలన ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతాయి. రూ. 333.55 కోట్ల అంచనా వ్యయంతో 2.8 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకుంది.ఫ్లైఓర్ నిర్మాణం వలన హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి వెళ్లేందుకు ఆ ప్రాంత ప్రజలకు సులభతరం అవుతుంది. 74 పిల్లర్స్ నిర్మాణాలు పూర్తిచేయడం జరిగింది. 72 పియర్ క్యాప్స్ పూర్తిచేయడం జరిగింది. 440 పి.ఎస్.సి గ్రీడర్స్ నిలబెట్టడం పూర్తిచేయడం జరిగింది.144 కాంపోసిట్ గ్రీడర్స్ పూర్తిచేయడం జరిగింది. 73 స్లాబ్ ల నిర్మాణం కూడా పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 93 శాతం పూర్తికాగా వచ్చే డిసెంబర్ నాటికి పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెనున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టూ ప్రధాన ఏరియాల గల ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడే అవకాశం ఉంది.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Another flyover in Hyderabad City

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page