దంపతుల ఆత్మహత్య

0 9,707

రామచంద్రపురం ముచ్చట్లు:

 

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజక వర్గం కాజులూరు మండలం కాజులూరు పంచాయతీ పరిధిలో అగ్నికులక్షత్రీయుల పేటకు చెందిన  రేకాడి పాపారావు రేకాడి పూసలమ్మ అనే దంపతులు బుధవారం తెల్లవారు జామున ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు..అప్పుల బాధ తాకలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు  పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది..విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్దలానికి  గ్రామ ఉప సర్పంచి దండంగి చిన్నారావు చేరుకున్నారు. మృతుల కుటుంభీకులను ఓదార్చారు..రెవెన్యూ వార్కి పోలీసు వార్కి సమాచారం అందించారు..కాకినాడ రూరల్ సి.ఐ మురళీ కృష్ణ…గొల్లపాలెం ఎస్ ఐ పవన్ కుమార్ లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.తూర్పు గోదావరి జిల్లా కాజులూరు పంచాయతీ పరిధిలో గల అగ్నికుల క్షత్రీయుల పేటలో మత్స్య కారులు అధికంగా నివసిస్తున్నారు..వీరిలో ఒకరైన రేకాడి పాపారావు…పూసలమ్మ దంపతులు కూడా నిత్యం చేపలను వేటాడుతూ జీవిస్తున్నారు.

 

 

 

- Advertisement -

పూసలమ్మ ప్రతీ రోజూ మార్కెట్టులో చేపలను విక్రయిస్తూ ఉంటారు..గ్రామంలో అందరితో మంచిగా పోతున్న వీరు అప్పుల భారిన పడ్డారు..దీంతో బుధవారం వేకువ జామున వారి నివాసంలోనే ఉరి వేసుకుని మృతి చెందారు..విషయం తెలియడంతో గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఉప సర్పంచి దండంగి చిన్నారావు  సంఘటనా స్థలానికి చేరుకున్నారు..అక్కడి మృతుడి కుటుంబీకులకు తగు సహయ చర్యలు అందించారు.మంత్రి వేణు గోపాలకృష్ణకు ఫోన్లో సమాచారం అందించారు..కాకినాడ రూరల్ సి.ఐ మురళీ కృష్ణ…గొల్లపాలెం ఎస్ ఐ పవన్ కుమార్ లు శాఖా పరమైన చర్యలు తీసుకున్నారు..ప్రభుత్వ పరంగా వార్కి అందాల్సిన రాయితీలు అందించాలని మంత్రి వేణు గోపాలకృష్ణ ఆదేశాలు జారీచేశారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; Couple suicide

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page