వాసాలమర్రిలో దళితబంధు యూనిట్ల పంపిణీ

0 9,689

యాదాద్రి ముచ్చట్లు:

 

సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో లబ్దిదారులకు దళితబంధు యూనిట్లను పంపిణీ చేశారు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి,విప్ ఆలేరు ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి.గ్రామంలో మొత్తం 76 మంది అర్హులు ఉండగా 66మంది అకౌంట్లలో రూ 10లక్షల చొప్పున డబ్బులు డిపాజిట్ అయ్యాయి.ఇందులో ఏడుగురు గూడ్స్ వెహికిల్స్,ఇద్దరు డోజర్లు, ఒకరు ఆటో యూనిట్లను ఎంచుకున్నారు.అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఎంత నిజమో దళితబంధు ను కూడా సక్సెస్ చేయడం అంతే నిజమన్నారు. దళితబంధు పథకం విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుడుతూ  సీఎం కేసీఆర్ అమలు చేసిన దళిత బంధు పథకం ద్వారా వాసాలమర్రి గ్రామ దళితులు  పురోగమిస్తున్నారు.వాసాలమర్రి దళితులు ముఖ్యమంత్రి గారి నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. వాసాలమర్రి గ్రామ దళితులు విజయం సాధించి  దేశానికే ఆదర్శంగా నిలవలన్నారు.

 

 

- Advertisement -

ఇవ్వాళ ప్రపంచం అంతా తెలంగాణ  విజయాల గురించే మాట్లాడుకుంటున్నారు.కేసీఆర్ ప్రభుత్వంతో  ఇవ్వాళ హరిత తెలంగాణ సాకారం అయింది. దళితబందు పథకం ప్రపంచానికే గొప్ప దారి చూపే పథకంమని దళిత బంధు పథకం  రోల్ మోడల్ అయిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  మేధస్సు నుంచి వచ్చిన  దళిత బంధు దేశంలో విప్లవం తీసుకొచ్చింది.గొప్ప గొప్ప కలలు కని వాటిని సాకారం చేసే దమ్మున్న  నాయకుడు కేసీఆర్ కే సాధ్యమన్నారు. ప్రజలు బాగుండాలి అని  రేయింబవళ్లు ఆలోచన చేసే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్.చేసే ప్రతి పనిలో విశ్వాసం ఉన్న నేత కేసీఆర్.తెలంగాణ సమాజం సహన శిలమైన శాంతియుత  సమాజంగా వర్ధిల్లుతున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోసాధించిన తెలంగాణ ను  నంబర్ వన్ రాష్ట్రం గా  తీర్చిదిద్దారు సీఎం కేసీఆర్.నిమిషం కూడా  కరెంట్ పోకుండా  24 గంటల పాటు విద్యుత్ అందిస్తున్న  మహానుభావుడు సీఎం కేసీఆర్ అని ఆసరా పెన్షన్  పథకం  ఆకలిని అన్నదే లేకుండా చేసిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; Distribution of Dalit units in Vasalamarri

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page