అక్టోబర్ 28న ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం 6వ స్నాత‌కోత్స‌వం

0 9,862

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విశ్వ‌విద్యాల‌యం 6వ స్నాత‌కోత్స‌వం అక్టోబర్ 28వ తేదీన జ‌రుగ‌నుంది. రాష్ట్ర గ‌వ‌ర్న‌రు శ్రీ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ( వర్చువల్ ) అధ్య‌క్ష‌త‌న ఈ కార్య‌క్ర‌మం జరుగనుంది.గురువారం ఉదయం 11.30 గంట‌ల‌కు వ‌ర్సిటీ ప్రాంగ‌ణంలోని యాగ‌శాల‌లో స్నాత‌కోత్స‌వం నిర్వ‌హిస్తారు. ఇందులో 2019-20 ఉత్తీర్ణులైన 122 మందికి బ్యాచిల‌ర్స్ డిగ్రీ, 46 మందికి మాస్ట‌ర్ డిగ్రీ, ఇద్ద‌రికి ఎంఫిల్‌, 11 మందికి పిహెచ్‌డి ప‌ట్టాలు ప్ర‌దానం చేస్తారు. అదేవిధంగా, తిరుప‌తికి చెందిన వేద‌పండితుడు బ్ర‌హ్మ‌గణేశన్ శ్రౌతి కి మ‌హామ‌హోపాధ్యాయ పుర‌స్కారం అంద‌జేస్తారు.ఎస్వీ వేద వ‌ర్సిటీ వైస్ చాన్స‌ల‌ర్ ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌నశ‌ర్మ స్వాగతోపన్యాసం చేస్తారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: October 28 SV Vedic University 6th Graduation Ceremony

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page