ఆలయంలో చోరీకి యత్నం

0 9,259

కామారెడ్డి ముచ్చట్లు:

 

కామారెడ్డి జిల్లా లోని  ఇస్రోజీవాడి గ్రామంలో నిన్న రాత్రి  గుర్తుతెలియని వ్యక్తులు గ్రామంలో గల ఎల్లమ్మ   గుడిలో ఉన్న హుండీ నుంచి డబ్బులు తీసుకునే యత్నం చేశారు. తాళాలు పగలగొట్టే ప్రయత్నం చేశారు పగలకా  పోవడంతో గల్లా హుండీని పెద్ద కర్ర సహాయంతో గళ్ళ హుండీ నీ గుడి తలుపులు వద్దకి లాగి అందినకాడికి చిల్లరడబ్బులు దోచుకున్నారు. అదేరోజు  గ్రామంలో ఉన్న రైతు వేదిక వద్ద కూడా  ఏ.ఓ రాణి గది కిటికీ  తలుపులు పగలగొట్టుకుని లోపలికి చొరబడ్డారు. బీరువాను ధ్వంసం చేసారు. వాటిలో విలువైన వస్థులు ఏమి లభ్యం  కాకపోవడంతో వెళ్ళిపోయారు. ఇది వరకు 15 రోజుల క్రితం అదే  గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టే ప్రయత్నం చేశారు. పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.  పోలీస్ సిబ్బంది,  గ్రామ సర్పంచ్  చొరవ తీసుకొని మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.  సీసీ కెమెరాలు ఉండి కూడా ఏమి ఉపయోగం లేకుండా పోతున్నాయని గ్రామస్తులు వ్యక్తం చేశారు.

- Advertisement -

బిచ్కుందలో కుక్కల బెడద

Tags; Attempted theft at the temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page