మద్యం గోదాంలో ఆగ్ని ప్రమాదం..అధికారుల విచారణ

0 9,877

ఆదిలాబాద్ ముచ్చట్లు:

 

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఎక్స్ రోడ్డులోని ఐఎంఎల్ డిపో గోదాంలో బుధవారం జరిగిన ప్రమాద ఘటన విషయమై ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ కరీంనగర్ డిప్టీ కమిషనరు శాస్త్రి,  శ్రీనివాసరెడ్డి లు ఐఎంఎల్ డిపో గోదాంను పరిశీలించారు. డిపో మేనేజర్, సిబ్బందితో కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదవశాత్తు జరిగి ఉంటుందని ఇందులో మొత్తం పది కోట్ల వరకు మద్యం కాలి బూడిదైపోయిందని వారన్నారు. సుమారుగా పది కోట్ల వరకు ఆరు పాయింట్ల నష్టం వాటిల్లి ఉంటుందని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు మీడియాతో తెలిపారు. డిపోలో పనిచేస్తున్న కూలీలతో పాటు స్థానికంగా ఉమ్మడి జిల్లాకు ఉట్నూరు డిపోనుండి సరఫరాయే మద్యం విషయమై అధికారులతో చర్చించి నిజామాబాద్ మంచిర్యాల నుండి మద్యం దుకాణాలకు సరఫరా చేసేందుకు అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్బంగా వారు తెలిపారు .

- Advertisement -

బిచ్కుందలో కుక్కల బెడద

Tags; Fire in liquor warehouse..Officers’ inquiry

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page