వామపక్షాల ఓటెటు

0 9,859

కరీంనగర్ ముచ్చట్లు:

 

తెలంగాణలోని హుజూరాబాద్ లో జరుగుతున్న ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలన్నీ కూడా ప్రచారంలో దూసుకెళుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జాతీయ పార్టీలని చెప్పుకునే సీపీఎం, సీపీఐ పార్టీలు మాత్రం హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ రెండు పార్టీల దుస్థితి చూస్తుంటే తెలంగాణలో ఈ పార్టీల భవిష్యత్ ఏంటనే సందేహాలు కలుగుతున్నాయి.రాజకీయంగా అత్యంత కీలకమైన హుజూరాబాద్ ఉప ఎన్నికలో సీపీఎం, సీపీఐ పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ రెండు పార్టీలకు క్యాడర్ ఉన్నప్పటికీ నాయకులు మాత్రం కరువైయ్యారు. ఈనేపథ్యంలో ఈ రెండు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించలేదని తెలుస్తోంది. తాము ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది కూడా ఇప్పటివరకు ఆ రెండు పార్టీలు తేల్చుకోలేకపోవడం విడ్డూరంగా మారింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదని మాత్రం స్పష్టం చేస్తున్నాయి.బీజేపీ మతతత్వ పార్టీ అనే కారణంగా వారికి మద్దతు ఇవ్వడం లేదని కామ్రేడ్లు చెబుతున్నారు.

 

 

 

- Advertisement -

అయితే టీఆర్ఎస్, కాంగ్రెస్ విషయంలో మాత్రం కామ్రేడ్లు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయమని సీపీఎం, సీపీఐ తమ క్యాడర్ కు సూచనలు చేస్తున్నాయి. అయితే ఏ పార్టీకి అనుకూలంగా ఉండాలో కామ్రేడ్లు ప్రకటించకపోవడం విడ్డూరంగా మారింది. ఈ పరిణామం క్యాడర్లో అయోమయానికి కారణం అవుతోంది.  ఇదే సమయంలో సీపీఎం మాత్రం స్థానిక నాయకత్వానికే నిర్ణయాన్ని వదిలేసింది. సీపీఐ మాత్రం కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయం ప్రకారంగా నడుచుకుంటామని చెబుతుండం విశేషం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి ప్రజా పోరాటాలు చేస్తున్న కామ్రేడ్లు ఎన్నికల విషయంలో మాత్రం కప్పదాటు విధానాన్ని అవలంభిస్తున్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ తో అంటకాగే కామ్రేడ్లు ఈ ఎన్నికలో మాత్రం వారికి మద్దతు ఇచ్చే అంశంపై మాట్లాడం లేదు. ఏ పార్టీతో కలిసి వెళ్తే ఎలాంటి ఇబ్బందులు వస్తుందోననే ఆందోళన ఆపార్టీ నేతల్లో కన్పిస్తోంది. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్రంలో కామ్రేడ్ల దుస్థితిని మరోసారి తేటతెల్లం చేసిందనే టాక్ విన్పిస్తోంది.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Left-wing vote

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page