ప్రశ్నలే.. జవాబు లేవి

0 9,693

విజయవాడ ముచ్చట్లు:

 

 

ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రశ్నలు వేయడం శాసనసభ్యుల హక్కు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు వివిధ శాఖల అధికారులు పూర్తి వివరాలతో సమాధానాలివ్వాల్సి ఉంటుంది. అయితే కొన్ని సంవత్సరాలుగా అధికారుల నుండి సంబంధిత సభ్యులకు జవాబులు అందడం లేదు. శాసనసభ సచివాలయం పదేపదే గుర్తు చేసినప్పటికీ అధికారుల్లో స్పందన కనిపించడం లేదు. ఇది తమ హక్కులకు భంగం కలిగించడమేనని ఎంఎల్‌ఏలు అంటున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఇచ్చిన జవాబులే కాకుండా కొన్ని ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానాలు ఇవ్వాల్సిఉంటుంది. ఒక్కోసారి సమయాభావంతోనో ఇతర కారణాలతోనూ సమాధానాలు ఇచ్చినట్లుగానే (డీమ్డ్‌ టుబి ఆన్సర్స్డ్‌) భావిస్తూనే సభను వాయిదా వేస్తుంటారు. అటువంటి సమయంలోనూ సభ్యులకు జవాబులు అందచేయాల్సిఉంటుంది. అన్‌స్టార్‌డ్‌ ప్రశ్నలు, షార్ట్‌ నోటీస్‌ ప్రశ్నలు, రూల్‌ 74, రూల్‌ 344 కింద సభ్యులు అడిగిన ప్రశ్నలకు కూడా జవాబులు రావడం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత 2019లో జరిగిన రెండో సమావేశాల నుంచి ఐదో విడత సమావేశాల వరకు మధ్యలో అనేక ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉందని శాసనసభ సచివాలయం ద్వారా తెలిసింది. ఇన్ని సంవత్సరాలుగా జవాబులు రాకపోవడాన్ని అసెంబ్లీ సచివాలయం కూడా తీవ్రంగానే భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖకు అసెంబ్లీ అధికారులు లేఖ రాశారుఇందులో భాగంగా ఎక్కువ ప్రశ్నలు మున్సిపల్‌, నీటిపారుదలశాఖ, పాఠశాల విద్య, రెవెన్యూ వంటి శాఖల్లోనే ఉన్నట్లు తేలింది. శాసనసభ రెండో సెషన్‌లోనే 26 ప్రశ్నలకు సమాధానాలు ఇంకా రాలేదు.

 

 

 

- Advertisement -

మూడో సెషన్‌లో ఒక్క మున్సిపల్‌ శాఖ నుంచే 24 సాధారణ ప్రశ్నలకు సమాధానాలు రాలేదు. రెవెన్యూ నుంచి 12, పాఠశాల విద్య నుంచి పది, నాలుగో సెషన్‌లో అటవీశాఖ, పౌరసరఫరాల శాఖల నుంచి ఆరేసి ప్రశ్నలకు, ఇరిగేషన్‌లో పది, పట్టణాభివృద్ధిలో 12, రెవెన్యూలో 13 ప్రశ్నలకు సమాధానాలు లేకుండా పోయాయి. ఐదో సెషన్‌లో కూడా అనేక ప్రశ్నలకు సమాధానాలు రాకపోగా, ఆరో సెషన్‌లో పౌరసరఫరాల నుంచి 8, పరిశ్రమల శాఖ నుంచి ఏడు, నీటి పారుదల శాఖ నుంచి తొమ్మిది, మున్సిపల్‌ శాఖ నుంచి 14, పంచాయితీరాజ్‌ శాఖ నుంచి తొమ్మిది, సాంఘిక సంక్షేమ శాఖ నుంచి పది ప్రశ్నలకు సమాధానాలు రాలేదు. మొత్తం ఆరు సెషన్లలో నక్షత్రేతర ప్రశ్నలు 31 ఇంకా సమాధానాలకు దూరంగా ఉన్నట్లు తెలిసింది. ఈ మొత్తం ప్రశ్నలకు సమాధానాలు పంపించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని, దీనిని అత్యవసర చర్యగా పరిగణించాలని శాసనసభ సచివాలయం కోరింది. శాసనసభలో ఎక్కువ శాతం సభ్యులు కొత్తగా ఎన్నికైన వారే ! వీరికి చర్చల్లో అవకాశం తక్కువగానే లభిస్తోంది. దీంతో నియోజకవర్గ సమస్యలను లేవనెత్తడానికి ప్రశ్నోత్తరాలనే వారు ఆశ్రయిస్తుంటారు. అక్కడ కూడా ఏళ్ల తరబడి జవాబులు రాకపోవడంతో వారు ఆవేదన వ్యక్త ం చేస్తున్నారు. . ఇదే అంశాన్ని పలువురు శాసనసభ సచివాలయం దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు సమాచారం.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Questions .. No answers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page