పుంగనూరులో రబి పంటలను ఈక్రాప్‌లో నమోదు చేయాలి

0 9,692

పుంగనూరు ముచ్చట్లు:

 

రైతులు రబి సీజన్‌లో పండిస్తున్న అన్ని పంటలను తప్పకుండ ఈక్రాప్‌లో నమోదు చేయాలని ఏడి లక్ష్మానాయక్‌ అన్నారు. గురువారం ఏవో సంధ్యతో కలసి ఆరు మండలాలకు చెందిన వ్యవసాయాధికారులు, ఏఈవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏడి మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు ప్రతి పంటను ఈక్రాప్‌లో నమోదు చేసి, ఈకెవైవి విధానాన్ని అమలు పరచాలన్నారు. అలాగే రైతులకు అవసరమైన ఎరువులకు ఆర్‌బికెలలో నిల్వలు ఉంచి, సకాలంలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులు పండించే పంటలకు ఎలాంటి తెగుళ్ళు సోకినా ఆర్‌బికెలలోని సిబ్బంది ద్వారా తగిన సలహాలు, సూచనలు తీసుకుని, మందులు వినియోగించాలని సూచించారు. అన్ని మండలాల్లోని రైతులకు అవగాహన కల్పించాలని, ఈ మేరకు వ్యవసాయాధికారులు, సిబ్బంది కలసి రైతుల పంటల ప్రాంతాలను పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో ఏఈవోలు జయంతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

బిచ్కుందలో కుక్కల బెడద

Tags: Rabi crops in Punganur should be registered in Ecrop

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page