టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాంకు కోర్టు ఊరట

0 9,698

విజయవాడ  ముచ్చట్లు:

 

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం విషయం లో విజయవాడ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఆయనకు భారీ ఊరట కలిగిస్తూ.. ఇచ్చిన తీర్పు పై టీడీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పార్టీ కార్యాలయం వద్ద టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. దీంతో టీడీపీ కి ముందస్తు దీపావళి వచ్చిందని.. నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమం లో చంద్రబాబు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. ఆ వెంటనే ఆయన 36 గంటల దీక్ష కు కూర్చన్నారు. ఇక.. తన తోపాటు తన తల్లి కూడా తిట్టారంటూ.. సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమం లోనే పట్టాభి పై మంగళగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ వెంటనే ఆయనను రాత్రి వేళ అరెస్టు చేశారు. అటు నుంచి అటే.. స్టేషన్ల కు తిప్పి.. ఎట్టకేల కు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. దీంతో 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించారు. అయితే.. హై కోర్టు ఆయన కు బెయిల్ మంజూరు చేయడం తో.. అటు నుంచి అటే.. మాల్దీవుల యాత్ర కు వెళ్లిపోయారు.అయితే.. రాష్ట్ర పోలీసులు మాత్రం.. సీఎం పై వ్యాఖ్యలు చేసిన నేపథ్యం లో పట్టాభిని తమ కస్టడీ కి అప్ప గించాలంటూ..

 

 

 

- Advertisement -

విజయవాడ లోని మేజిస్ట్రేట్ కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. దీని పై విచారణ జరిపిన కోర్టు .. కస్టడీ పిటిషన్ ను కొట్టేసింది. పట్టాభి ని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్ట్ లో పోలీసుల పిటిషన్ దాఖలు చేయడం తో టీడీపీ శ్రేణులు ఒకింత గాబరా పడ్డాయి. ఆయన ను అదుపు లోకి తీసుకుంటే.. కొడతారేమో.. దుర్భాషలాడతారేమో.. అని భావించారు. అయితే.. పట్టాభి తరపున వాదనలు వినిపించిన న్యాయ వాది గూడపాటి లక్ష్మీ నారాయణ… కస్టడీ అవసరం లేదని పేర్కొన్నారు. పోలీసులు తరపున వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయ వాది.. కస్టడీ ఇవ్వాలన్నారు. ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు కస్టడీ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. సీఎం జగన్ ను ఉద్దేశించి పట్టాభి పరుషం గా వ్యాఖ్యానించారంటూ.. వైసీపీ నాయకులు టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన విషయం తెలిసిందే.

బిచ్కుందలో కుక్కల బెడద

Tags; TDP National Spokesperson Pattabhiram to sit in court

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page