వ్యాక్సినేషన్ ను వేగవంతంగా చేపట్టాలి…

0 9,693

మహబూబాబాద్ ముచ్చట్లు:

 

వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. గురువారం కలెక్టర్ మహబూబాబాద్ మండలం కంబాలపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సాధ్యమైనంత వరకూ త్వరగా పూర్తి చేయాలన్నారు పంచాయతీ సెక్రెటరీ లతో డోర్ టు డోర్ సర్వే చేపట్టాలని మండల పంచాయతీ అధికారిని ఆదేశించారు. ఎంపీడీవోల వద్ద ఓటరు జాబితా  పాటుగా రేషన్ డీలర్ల వద్ద లబ్ధిదారుల వివరాలు, డి ఆర్ డి ఏ అధికారుల వద్ద పెన్షనర్ల వివరాలు, ఐసిడిఎస్ అధికారుల వద్ద గర్భిణీ స్త్రీల పేర్లు తీసుకోవాలని వాస్తవ నివేదిక రూపొందించుకొని ఇంటింటి సర్వే చేపట్టి వ్యాక్సినేషన్ వేయించుకున్నవారు, వేయించుకోని వారు, మృతిచెందిన వారు, వలస వెళ్లిన వారిని గుర్తించి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. అలాగే 2వ డోస్ ఏ వ్యాక్సిన్ వేసుకున్నారు? ఎంతమంది ఉన్నారు అని పరిశీలించి మొదటి డోస్ వేసుకున్న తేదీ ప్రకారంగా రెండవ డోసు కూడా పూర్తి చేయాలన్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో పరిశుభ్రతను పరిశీలిస్తూ దట్టమైన చెట్లను సరి చేయించాలని చెత్తాచెదారం తొలగించి పరిశుభ్ర పరచాలని ఎంపీడీవో ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఆర్డిఎ పిడి సన్యాస య్య మండల ప్రత్యేక అధికారి లక్ష్మీనారాయణ ఉప వైద్యాధికారి అంబరీష ఎం పి డి ఓ రవీందర్ వైద్యాధికారి సుధీర్ ఎం పీ ఓ హరి ప్రసాద్ పంచాయతీ సెక్రటరీ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

బిచ్కుందలో కుక్కల బెడద

Tags; Vaccination should be expedited …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page