రుణానికి పెద్దపీట!

0 9,692

-ప్రస్తుత ఏడాది రైతులకు రూ.13,007.26 కోట్ల రుణలక్ష్యం
-2020-21లో లక్ష్యానికి మించి రూ.1,159 కోట్ల అదనపు మంజూరు
-రైతాంగ పంట రుణాలకు పెద్దపీట
-జిల్లా రుణప్రణాళిక రూ.21,919.20 కోట్లు

 

చిత్తూరుముచ్చట్లు:

 

- Advertisement -

రైతాంగానికి ప్రభుత్వం వెన్నముకలా నిలుస్తోంది. సకాలంలో రుణాల మంజూరు, ప్రభుత్వ పథకాలు అందజేత, వ్యవసాయ అనుబంధ రంగాలకు చేయూతనిస్తోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యవసాయ రైతులకు ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో గతంలోలేని విధంగా రికార్డుస్థాయిలో రూ.13,007.26 కోట్ల పంట రుణాలు అందించాలని నిర్ణయించింది. గత ఏడేళ్లలో వ్యవసాయాని అత్యధిక రుణప్రణాళిక ఇదే. ఖరీఫ్‌, రబీ సీజన్లలో పంటలు సాగుచేసే రైతాంగానికి పెట్టుబడి ఇబ్బందులు తొలగించేలా రైతు భరోసా ద్వారా ఆర్థిక సహకారం అందుతోంది. అలాగే బ్యాంకుల ద్వారా విరివిగా రుణాల మంజూరుకు ప్రణాళికలను అమలు చేస్తోంది. జిల్లాలోని 31 బ్యాంకులకు చెందిన 615 బ్యాంకుశాఖల ద్వారా రైతులకు రూ.13.007 కోట్ల రుణాలు మంజూరు కానున్నాయి.

 

×6.35లక్షల రైతులకు లబ్ది
2021-22లో జిల్లాలో ఖరీఫ్‌, రబీ సీజన్‌లో పంటలు సాగుచేసే 6,35,876 మంది రైతులకు రుణాలు అందించాలని నిర్ణయించారు. ఖరీఫ్‌ రైతులకు రూ.5,250 కోట్లు, రబీలో పంటలు సాగుచేసే రైతులకు రూ.3,500 కోట్ల రుణాలు మంజూరు చేస్తారు. వ్యవసాయ మధ్య, దీర్ఘకాలిక రుణాలు రూ.4,257.26 కోట్లు అందించనున్నారు. ఈ రుణాలతో రైతాంగానికి పెట్టుబడి కష్టాలూ తీరడమేకాక, ప్రయివేటు వ్యాపారుల నుంచి అఫ్పులు తీసుకునే కష్టాలు తప్పుతాయి. కాగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.21,919.20 కోట్ల రుణ ప్రణాళిక అమలు చేయనున్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.3,350 కోట్లు, ప్రాధాన్య రంగాలకు రూ.868.58 కోట్లు, ఇతరా రంగాలకు రూ.4,693.28 కోట్లు మంజూరు చేయనున్నారు.

 

×రెండేళ్లు రికార్డు
వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రయ్యాక వ్యవసాయానికి ఇస్తున్న ప్రాధాన్యత లెక్కలు రైతులకు అందిస్తున్న సహాయం చెబుతోంది. గతంలో లేని విధంగా వ్యవసాయానికి ప్రణాళికకు మించిన రుణాలు ఇస్తున్నారు. 2019-20లో జిల్లా రైతాంగానికి రూ.9,897.00కోట్ల రుణాలు అందించాలన్న లక్ష్యంగా కాగా రూ.1,938.77 కోట్ల అదనంతో రూ.11,835.77 కోట్లు అందించారు. 2020-21లో రూ.8,480 కోట్ల రుణలక్ష్యం కాగా అదనంగా రూ.1,159 కోట్లతో రూ.9,639 కోట్ల రుణాలు అందించారు.

×2014 నుంచి పంట రుణాలు (రూ.కోట్లలో)
——————————
ఏడాది లక్ష్యం మంజూరు
——————————
2014-15 రూ.3,573.52 రూ.3,020.10
2015-16 రూ.4,484.73 రూ.5,679.58
2016-17 రూ.6,189.93 రూ.6,676.55
2017-18 రూ.6,967.53 రూ.7,256.58
2018-19 రూ.7,900.59 రూ.8,180.43
2019-20 రూ.9,897.00 రూ.11,835.77
2020-21 రూ.8,480.00 రూ.9,639.00
——————————

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి .

Tags: Big loan!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page