కోవిడ్ వ్యాక్సినేషన్ వారం రోజుల్లో 100 శాతం పూర్తి చేయాలి.

0 7,559

-*జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

కామారెడ్డి  ముచ్చట్లు:

- Advertisement -

జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ వారం రోజుల వ్యవధిలో వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్  వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మండల స్థాయి అధికారులు, వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య కార్యకర్త ప్రతిరోజు 50 మందికి వ్యాక్సినేషన్ చేసే విధంగా చూడాలన్నారు. ప్రతి గ్రామానికి  వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక అధికారులను నియమించినట్లు చెప్పారు. మండల స్థాయి అధికారులు గ్రామాల్లో పర్యవేక్షణ చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు 100 శాతం వ్యాక్సినేషన్ చేయించుకోవాలని కోరారు. శ్రీనిధి రుణం బకాయిలు వసూలు చేయాలని ఐకెపి అధికారులను ఆదేశించారు. ఓటర్ల నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. జనవరి 1,2022 ప్రామాణికంగా తీసుకొని అప్పటి వరకు 18 సంవత్సరాలు నిండిన కళాశాల విద్యార్థులకు యజమాన్యాలు అవగాహన కల్పించి ఓటరు జాబితాలో చోటు కల్పించాలని కోరారు. ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచే విధంగా పంచాయతీ కార్యదర్శులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, జడ్పీ సీఈవో సాయాగౌడ్, అధికారులు పాల్గొన్నారు.

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి .

Tags:Kovid vaccination should be completed 100 percent on weekdays.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page