సేఫ్ ప్లేస్ కోసం లోకేష్.

0 7,563

గుంటూరు ముచ్చట్లు:

నారా  లోకేష్ కు వచ్చే ఎన్నికలు మరింత సవాలుగా మారనున్నాయి. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో తన నియోజకవర్గంలో కూడా విస్తృతంగా పర్యటించాల్సి ఉంటుంది. అయితే మంగళగిరి నియోజకవర్గమయితే రాష్ట్రం మొత్తం పర్యటించడం సాధ్యం కాదని లోకేష్ తో పాటు చంద్రబాబు కూడా భావిస్తున్నారు. ఒక్క మంగళగిరికే లోకేష్ పరిమితమయితే నాయకుడిగా ఎదగడం సాధ్యం కాదు.దీంతో నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో పోటీపై సందిగ్దంలో పడినట్లు తెలుస్తోంది. రాజధానిని తరలిస్తామని జగన్ ప్రకటించిన తర్వాత కూడా అక్కడ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ప్రజలు ఎక్కువ మంది టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఫీడ్ బ్యాక్ వస్తున్నా లోకేష్ దానిని విశ్వసించడం లేదు. మరో సారి ఓటమి పాలయి నవ్వుల పాలు కాకూడదన్నది నారా లోకేష్ నిర్ణయంగా ఉంది.మంగళగిరిలో వైసీపీకి పట్టుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి పోటీ చేస్తే ఎదుర్కొనడానికి పూర్తి సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. నాలుగు రోజులు ప్రచారానికి వెళ్లి వస్తే మొన్నటి ఫలితాలే రిపీట్ అయ్యే అవకాశముంది. అందుకే మంగళగిరిని వదిలేయాలన్న ఆలోచనలో నారా లోకేష్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు సేఫ్ ప్లేస్ కోసం వెదుకుతున్నట్లు సమాచారం. సులువుగా గెలిచే నియోజకవర్గాన్ని లోకేష్ ఎంచుకుంటారని చెబుతున్నారు.రాయలసీమ ప్రాంతమైన కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తున్నారు. దీంతో ఆయన సీమ నుంచి పోటీ చేసే అవకాశం లేదు. ఇక ఉత్తరాంధ్ర, కోస్తాలో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలి. నారా లోకేష్ కు కృష్ణా జిల్లాలోని పెనమలూరు, విశాఖ జిల్లలోని భీమిలి నియోజకవర్గాలపైనే దృష్టి ఉందంటున్నారు. ఎన్నికలకు ముందు సర్వే చేయించిన తర్వాత మాత్రమే ఏ నియోజకవర్గం నుంచి పోట ీచేయాలన్న నిర్ణయాన్ని లోకేష్ తీసుకుంటారంటున్నారు. మంగళగిరిలో మాత్రం మరోసారి పోటీ చేసే సాహసం లోకేష్ చేయకపోవచ్చు. విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకోకూడదని డిసైడ్ అయ్యారు.

- Advertisement -

బిచ్కుందలో కుక్కల బెడద

Tags:Lokesh for Safe Place

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page