తెలంగాణకు ఎన్జీటీ షాక్

0 7,557

హైదరాబాద్ ముచ్చట్లు:

 

నేషననల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) లో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ స్టే విధిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పనులు వెంటనే ఆపాలని.. అటవీ, పర్యావరణ అనుమతులు లేకుండా ఎత్తిపోతల పథకం పనులు చేపట్టొద్దంటూ ఎన్జీటీ చెన్నై బెంచ్‌ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం పలు అభ్యంతరాలను లేవనెత్తింది. తాగునీటి కోసమని.. ప్రాజెక్టు ప్రారంభించారని.. ఇప్పుడు సాగునీటి కోసం పథకం పనులు జరుగుతున్నాయంటూ పిటిషనర్ వాదనలు వినిపించారు. ఎలాంటి అనుమతులులేకుండా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందంటూ వివరించారు.
అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వివరణతో ఎన్జీటీ సంతృప్తి చెందలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చెప్పిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఎన్జీటీ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై స్టే విధించింది. కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు లేకుండా ఎత్తిపోతల పథకం పనులు చేపట్టొద్దంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది.

- Advertisement -

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి .

Tags:NGT shock to Telangana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page