రజనీ సేఫ్.

0 7,559

చెన్నై  ముచ్చట్లు:

సూపర్‌ స్టార్  రజినీకాంత్‌ హెల్త్‌ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్‌ను గుర్తించిన వైద్యులు.. అవసమైన ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. త్వరలోనే రజినీకాంత్‌ను హాస్పిటల్‌ నుంచి‌ డిశ్చార్జ్ చేయనున్నట్లు కావేరి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.ప్రస్తుతం రజినీకాంత్‌కు 72ఏళ్లు. ఓ వైపు వయసు మీద పడడం.. మరోవైపు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో షూటింగ్‌లు కూడా తగ్గించుకున్నారు. ఇక పార్టీ పేరు ప్రకటించి కూడా వెనక్కి తగ్గారు. దీని వెనుక కూడా అనారోగ్య సమస్యలేనని తెలుస్తోంది. రజినీ లెటెస్ట్ మూవీ అన్నాత్తే.. తెలుగులో పెద్దన్నగా వస్తోంది. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. నవంబర్‌ 4న రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.
2011లో ఎమెసిస్‌ అనే అనారోగ్య సమస్యతో ఇబ్బందిపడ్డారు రజినీకాంత్. తీసుకున్న ఆహారం వాంతుల రూపంలో బయటకు రావడమే ఎమెసిస్‌. ఈ వ్యాధి ఆయన్ను చాలా బాధించింది. ఎమెసిస్‌ ట్రీట్‌మెంట్ సమయంలో బ్రాంకైటిస్ బారిన పడ్డారు రజినీ. బ్రాంకైటిస్‌తో కొన్నాళ్లు ఐసీయూలోనే చికిత్స తీసుకున్నారు.  సింగపూర్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకున్న అనంతరం కోలుకున్నారు.
(శ్వాసకోశ నాళాల్లో కలిగే మార్పులతో ఆయాసం, దగ్గు, కఫం, జ్వరం, నీరసం లాంటివి మాటిమాటికీ ఇబ్బంది పెడుతుంటాయి. ఈ వ్యాధిని బ్రాంకైటిస్‌ ఒక్కోసారి అది దీర్ఘకాలం కనిపించే వ్యాధిగా మారుతుంది. దీనితో రోగ నిరోధకశక్తి తగ్గడం, ఆస్తమా లాంటి పరిణామాలు సంభవిస్తాయి)
2020, డిసెంబర్ 13న షూటింగ్ నిమిత్తం రజినీకాంత్‌ హైదరాబాద్‌కు వచ్చారు. ఆర్‌ఎఫ్‌సీ విలేజ్‌ సెట్‌లో అన్నాత్తే షూటింగ్‌లో పాల్గొన్నారు. 2020, డిసెంబర్ 29 వరకు అన్నాత్తే షూటింగ్ ప్లాన్ చేశారు. అయితే యూనట్‌లో కొంతమందికి కరోనా పాజిటివ్‌ రావడంతో.. షూటింగ్‌ నిలిపివేశారు. 2020, డిసెంబర్ 22న హై బీపీతో అపోలోలో అడ్మిట్ అయ్యారు.2021, జూన్‌ 19న ప్రత్యేక విమానంలో అమెరికాకు వెళ్లారు రజినీకాంత్.  సాధారణ వైద్య పరీక్షల కోసమేనని ప్రకటన విడుదల చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాలో రజినీకి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ జరిగింది. అప్పటినుంచి ప్రతి ఏడాది చెకప్‌ కోసం ఆయన అమెరికాకు వెళ్తున్నారు.

- Advertisement -

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి .

Tags:Rajini Safe

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page