కేసరపల్లి ఇళ్లలలో మురుగు నీరు.

0 7,561

గన్నవరం ముచ్చట్లు:

గన్నవరం మండలం  కేసరపల్లి బీసీ కాలనీలో ఏ ఇంటి  తలుపు తట్టినా ఇళ్లలలో మురుగు నీరు విషజ్వరాలే.. డ్రైయినేజీ మురుగు కాల్వ జన జీవనం కనిపిస్తుంది.  డ్రైయినేజీ కాల్వ మురుగునీరు పొంగిపొర్లి ఇళ్లల్లోకి ప్రవేశించి జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లోకి చేరి నాలుగు మూడు రోజులు నిల్వ ఉండి దోమలు , విష పురుగులు , కప్పులు సంచరించటంతో పాటు  ప్రతి ఇంట్లో ఇద్దరికి చొప్పున డెంగ్యూ , టైఫాయిడ్ , మలేరియా లాంటి విష జర్వాలతో ఇబ్బందులు పడుతున్నారు. డ్రైయినేజీ కాల్వని ఆక్రమణలకు గురి కావటంతో మురుగు నీరు పారుదల అగిపోయింది. ప్రధాన సెంటర్లో పాత మంచినీటి బావిని పంచాయతీ వారు పూడ్చటంతో అస్ధలాన్ని కూడా ఆక్రమించారు. మొయిన్ సెంటర్ నుంచి బీసీ కాలనీ మీదుగా క్రాస్ రోడ్ రెస్టారెంట్ వరకు ఉన్న డ్రైయినేజీ ప్రతి చోట ఆక్రమణలే. దీంతో డ్రైయినేజీ కాల్వ పూడిపోతుంది. చెత్త చేదారం , ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు పడేయటం కూడా డ్రైయినేజీ మురుగునీరు పారుదలకు అటంకం ఏర్పడుతుంది. బీసీ కాలనీలో రోడ్లు పాడై అద్వాన్నంగా  దర్శనమిస్తున్నాయి. మా సమస్య పరిష్కరించాలని పంచాయతీ అధికారులు ఎన్ని సార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైయినేజీ కాల్వ శాశ్వత పరిష్కారం చేయాలని , రోడ్డు నిర్మించాలని లేకుంటే తమ జీవితాలు ఆగమ్యగోచరంగా ఉంటాయిని అంటున్నారు.

- Advertisement -

బిచ్కుందలో కుక్కల బెడద

Tags:Sewage in Kesarapally houses

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page