పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి. ఏఐఎస్ఎఫ్

0 7,563

 

ఎమ్మిగనూరు  ముచ్చట్లు:

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేసి విద్యార్థుల ఆదుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి విజయేంద్ర తెలిపారు.ఎమ్మిగనూరు న్యూస్ పట్టణంలో స్థానిక సిపిఐ కార్యాలయం ముందు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి విజేంద్ర ఏఐఎస్ఎఫ్ తాలూకా అధ్యక్షడు సమీ ఉల్ల   మాట్లాడుతూ 2019- 2020 పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు కళాశాలకు సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళితే నీ ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ విడుదల చేయలేదు కాబట్టి తక్షణమే ఫీజు కట్టని సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారని, ఇప్పటికే పీజీ, బీడీ,ఎంబీఏ,ఎంసీఏ, పాలిటెక్నిక్,ఐ టి ఐ, తదితర లాంటి కోర్సులు పూర్తి చేసి పై చదువుల కొరకు సర్టిఫికెట్స్ తీసుకోవడానికి వెళితే కళాశాల యాజమాన్యం సర్టిఫికెట్ ఇవ్వకుండా పంపుతున్నారని, ముఖ్యంగా జగన్ అన్న వసతి దీవెన విద్య దీవెన లాంటి పథకాలతో విద్యార్థులను మోసం చేస్తూ, కళాశాల కు రావలసిన రియంబర్స్మెంట్ విద్యార్థుల తల్లిదండ్రులకు ఇచ్చి వారికి ఓట్ల రాబట్టుకునే ప్రయత్నం జరుగుతుందని, దీనివల్ల కళాశాలలు మూత పడే ప్రమాదం గా ఉందని, కాబట్టి తక్షణమే ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన కళాశాల అకౌంట్ కి జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఖాదర్, సమీర్, కేశువు, నూర్, చిన్న, రవి, తదితరులు పాల్గొన్నారు.

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి .

Tags:The pending Fee Reimbursement Scholarship should be released. AISF

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page