బద్వేలు ఉప ఎన్నిక ని పరిశీలించిన .

0 8,787

అమరావతి ముచ్చట్లు:

బద్వేల్ ఉపఎన్నిక ప్రక్రియను అమరావతి సచివాలయం లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె. విజయానంద్ పరిశీలించారు.  శనివారం  ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నది అన్నారు.  ఉదయం 9 గంటల వరకు 10.49 ఓట్లు నమోదు అయినట్లుగా వెల్లడించారు.  అన్ని పోలింగ్ స్టేషన్లో ఉదయం 7 గంటలకే మాక్ పోల్ నిర్వహించడం జరిగిందని, మూడు చోట్ల ఈవీఎంలు పని చేయక పోవడాన్ని గుర్తించి వెంటనే వాటిని మార్చి వేయడం జరిగింది అన్నారు.  స్థానికంగా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే రాజకీయ నాయకులు వాటిని అధికారుల దృష్టికి తెచ్చిన వెంటనే  పరిష్కరించడం జరుగుతున్నదని తెలిపారు.  ఈ ఓటింగ్ ప్రక్రియ ను 24 మంది అధికారులు పరిశీలిస్తున్నారని, ఇప్పటివరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు తమ దృష్టికి రాలేదని తెలిపారు.  నియోజవర్గం సరిహద్దులు అన్ని పూర్తిగా మూసివేయడం  జరిగిందని బస్సులలో తరలింపుకు ఎటువంటి ఆస్కారం లేదని ఆయన తెలిపారు.

- Advertisement -

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి .

Tags:Badvelu is the CEO who oversaw the by-election

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page