భారీగా మొహరిస్తున్న సైన్యం.

0 7,557

బీజింగ్ ముచ్చట్లు:

మొన్న లద్దాక్‌..నేడు తవాంగ్‌ ప్రాంతాల్లో చైనా సైన్యాన్ని మోహరిస్తుంది. దీంతో చైనా దూకుడుకు చెక్‌ పెట్టేందుకు చైనా సరిహద్దుల్లో భారీ బందోబస్త్‌ను భారత్‌ ఏర్పాటు చేస్తోంది. గత ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో భారత్‌ భూటాన్‌, టిబెట్‌లకు ఆనుకుని ఉన్న తవాంగ్‌ ప్రాంతం పై చైనా కన్ను పడింది. ఎలాగైనా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని దురుద్దేశపూర్వకంగా అక్కడి ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరిస్తుంది.దీంతో చైనాకు ధీటుగా జవాబు చెప్పేందుకు అమెరికా తయారు చేసినా చినూక్‌ హెలికాప్టర్లు, అల్ట్రా-లైట్‌ టోవ్డ్‌ హోవిట్జర్లు, రైపిల్స్‌తో పాటు స్వదేశియంగా తయారు చేసిన సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణులు అత్యాధునిక నిఘా వ్యవస్థను ఈ ప్రాంతంలో భారత్‌ ఏర్పాటు చేసింది. చైనాను ఎదుర్కొంనేందుకు మౌంటెయిన్‌ స్ర్టయిక్‌ కార్ప్‌, కంబాట్‌ సపోర్ట్‌తో సైన్యం పూర్తి సన్నద్ధంగా ఉందని ఈస్ట్రన్‌ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్ పాండే తెలిపారు. బూట్‌లు, కవచం, ఫిరంగిదళాలతో పాటు వైమానిక దళాలతో దాడులను తిప్పి గొట్టగలమని ఆయన తెలిపారు.గతేడాది గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల్లో భారత్‌కు చెందిన 20కి మందికి పైగా భారత సైనికులు మరణించడంతో చైనా సరిహద్దు వెంబడి భారత్‌ రక్షణను బలోపేతం చేస్తూ వస్తోంది. ఏడాది కాలంగా చర్చలు జరుగుతున్నా కశ్మీర్‌కు చెందిన సమీపంలో ఉన్న కీలక సరిహద్దు ప్రాంతమైనా ఫ్లాష్‌ పాయింట్‌ నుంచి చైనా వెనక్కి తగ్గడానికి అంగీకరించలేదు. దీంతో సరిహద్దు వెంబడి భారీగా భద్రత బలగాలను భారత్ మోహరించాల్సి వస్తోంది.

- Advertisement -

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి .

Tags:Heavily deployed army

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page