షర్మిలపై ఎదురు దాడేనాఁ

0 7,761

హైదరాబాద్ ముచ్చట్లు:

వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర సమితికి తలనొప్పిగా మారారు. మొన్నటి వరకూ షర్మిలను పెద్దగా పట్టించుకోని టీఆర్ఎస్ ఇప్పుడిప్పుడే ఆమెపై మాటల దాడిని ప్రారంభించింది. రానున్న కాలంలో మరింత తీవ్రతరం చేయాలని భావిస్తుంది. వైఎస్ షర్మిలను మానసికంగా దెబ్బతీసేందుకే టీఆర్ఎస్ ఈ ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పాలి. వైఎస్ షర్మిలను తొలుత టీఆర్ఎస్ తేలిగ్గా తీసుకుంది. ఏపీ మూలాలున్న షర్మిలతో ఒరిగేదేమీ లేదన్న ధీమాతో ఉంది.కానీ వైఎస్ షర్మిల తెలంగాణలో సీరియస్ రాజకీయాలు చేస్తున్నారని గమనించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఇక్కడకు చెందిన నేతలు ఎవరూ ఇంతటి సుదీర్థ పాదయాత్రను ఇప్పటివరకూ ప్రారంభించలేదు. కానీ షర్మిల నాలుగువేల కిలోమీటర్ల నడకకు సిద్ధమయ్యారు. దీంతో పాటు ఆమె పాదయాత్రకు కూడా విశేష స్పందన కన్పిస్తుంది. రెడ్డి సామాజికవర్గంతో పాటు దళిత ఓట్లను చీల్చే అవకాశముందని నివేదికలు కూడా అందడంతో టీఆర్ఎస్ అప్రమత్తమయింది.దాదాపు ఏడాదిగా వైఎస్ షర్మిల పార్టీపైన నేతలు ఎవరూ స్పందించలేదు. ఆమె పార్టీలోకి తెలంగాణ నేతలు ఎవరు చేరరన్న ధీమాతో పాటు ప్రజలు కూడా షర్మిలను తెలంగాణ వ్యతిరేకిగానే చూస్తారని అభిప్రాయపడింది. పైగా జగన్ ఏపీలో ముఖ్యమంత్రిగా ఉండంటతో ఇక్కడ షర్మిల ఆటలు సాగవని కూడా టీఆర్ఎస్ భావించింది. పట్టించుకుంటే అవసరంగా హైప్ క్రియేట్ చేసినవారమవుతామని సైలెంట్ గానే ఉంది.అయితే షర్మిల రోజురోజుకూ సీరియస్ గా అధికార పార్టీపై విమర్శలు చేస్తుండటంతో మాటల దాడిని ప్రారంభించింది. మంగళవారం మరదలంలూ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. దీనికి షర్మిల కూడా పవర్ ఫుల్ గానే కౌంటర్ ఇచ్చారు. ఆ కుక్కకు కవిత ఏమవుతారో చెప్పాలని నిలదీశారు. రానున్న కాలంలో షర్మిలపై టీఆర్ఎస్ మరింత మాటల దాడిని పెంచే అవకాశాలున్నాయి.

- Advertisement -

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి .

Tags:Sharmila was attacked

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page