పుంగనూరులో కోటిరూపాయలతో లయన్స్ క్లబ్ చే డయాబెటిక్‌ సెంటర్‌ -క్లబ్‌ జిల్లా గవర్నర్‌ భక్తవత్సలరెడ్డి

0 9,644

పుంగనూరు ముచ్చట్లు:

 

జిల్లాలో ఎక్కడా లేని విధంగా పుంగనూరు లయన్స్ క్లబ్  చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి ఇంటర్నేషనల్‌ క్లబ్‌ కోటి రూపాయలతో డయాబెటిక్‌ సెంటర్‌ నిర్మాణానికి విరాళం అందిస్తుందని జిల్లా గవర్నర్‌ భక్తవత్సలరెడ్డి తెలిపారు. ఆదివారం క్లబ్‌ గవర్నర్లు వినూతప్రకాష్‌ , రామరాజు , ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ శివ తో కలసి డయాలసిస్‌ సెంటర్‌ను పరిశీలించి, ప్రశంసించారు. భక్తవత్సలరెడ్డి మాట్లాడుతూ డయాలసిస్‌ సెంటర్‌ ప్రారంభించి ఐదు నెలల కాలంలో ఇప్పటి వరకు మూడువేల మందికి డయాలసిస్‌ చేయడం జరిగిందని క్లబ్‌ను అభినందించారు. మహో త్తర సేవా కార్యక్రమాలు అందిస్తున్న క్లబ్‌ ద్వారా చక్కెరవ్యాధి గ్రస్తులకు సేవలు అందించేందుకు ఆసుపత్రి నిర్మాణం చేపడుతామన్నారు. ఈ విషయంలో స్థానిక క్లబ్‌ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో క్లబ్‌ అధ్యక్షుడు మహేంద్రరావు, ప్రతినిధులు డాక్టర్‌ సరళ, గోపాలకృష్ణ, రఘునాథరెడ్డి, శ్రీధర్‌, వరదారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags; Diabetic Center by Lions Club in Punganur with crores of rupees -Club District Governor Bhaktavatsalareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page